twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘జబర్‌దస్త్'... కాపీ వివాదంపై నందినీ రెడ్డి స్పందన

    By Srikanya
    |

    హైదరాబాద్: మొన్న శుక్రవారం విడుదలైన రొమాంటిక్ ఎంటర్టైనర్ 'జబర్‌దస్త్' . ఈ చిత్రం రిలీజ్ రోజు మార్నింగ్ షోకే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే మరో ప్రక్క ఈ చిత్రం హిందీలో హిట్టయన బ్యాండ్ బాజా బారాత్ కాపీ అని అందరూ తేల్చయటంతో లీగల్ తలనొప్పుల్లో ఇరుక్కోనుందని సమాచారం. మరో ప్రక్క బ్యాండ్ బాజా బారాత్ చిత్రాన్ని తెలుగు,తమిళ భాషల్లో నానితో చేయటానికి యష్ రాజ్ ఫిల్మ్స్ వారు రెడీ అవుతున్నారు. అయితే వారి నిర్ణయం మారుతుందా అనేది ఇప్పుడు అంతటా చర్చగా మారింది. ఈ నేపధ్యంలో నాని ఓ పాపులర్ ఇంగ్లీష్ డైలీ వారు ఈ విషయమై అడిగారు.

    ఈ విషయమై నాని స్పందిస్తూ.. " నేను చేస్తున్న సినిమా ఆల్రెడీ మొదలైంది. తెలుగు,తమిళ భాషల్లో విడుదల అవుతుంది. ," ఖరారు చేసారు. అలాగే... బ్యాండ్ బాజా బారాత్ ప్రిమైజ్, జబర్దస్త్ ప్రిమైజ్ ఒకటే అంటున్నారు అని అడగగా.. "నేను ఇప్పటివరకూ ఆ సినిమాని చూడలేదు. అయితే చాలా మంది హిందీ సినిమాలాంటి సిమిలర్ కథ అంటున్నారు... .", అయితే ఏమన్నా లీగల్ యాక్షన్ తీసుకునే అవకాసం ఉంటుందంటారా అంటే.. " నేను ప్రొడ్యూసర్ కాదుగా అని తేల్చేసారు..

    మరో ప్రక్క దర్శకురాలు నందినీరెడ్డి ఈ వివాదంపై స్పందిస్తూ... "నేను బ్యాండ్ బజా బారత్ కి మా సినిమాకు పోలిక ఉంటుందనుకోలేదు.. అలాగే మా సినిమాలో హీరో,హీరోయిన్స్ ఈవెంట్ మేనేజర్స్ మాత్రమే...వెడ్డింగ్ ప్లానర్స్ కాదు. వారు ప్రెషర్స్ పార్టీలు, కార్పోరేట్ పంక్షన్స్, షష్టిపూర్తి ఉత్సవాలు వంటివి కూడా చేస్తారు. అంతేకాదు మేము మా సినిమాకు తీసుకున్న కంపెనీ కూడా ఈవెంట్ మేనేజమెంట్ కంపెనీ...నేను ఈవెంట్ మేనేజ్ మెంట్ ని మా సినిమా కు బ్యాక్ డ్రాప్ గా తీసుకోవటానికి కారణం...సినిమాకు కొత్త కలర్,లుక్ వస్తుందని మాత్రమే ..అయినా వెడ్డింగ్ ప్లానర్స్ బ్యాక్ డ్రాప్ లో చాలా హాలీవుడ్ చిత్రాలు వచ్చాయి...అని తేల్చి చెప్పారు.

    అంతేకాదు తాను చాలా దాదాపు 23 సినిమాల నుంచి ప్రభావితురాలునయ్యానని అన్నారు. క్లైమాక్స్ సీన్ ని ..జానే బీ దో యారో నుంచి తీసుకున్నాను. అలాగే అమితాబ్ ..యారానా లో కొన్ని సీన్స్, డేవిడ్ ధావన్ స్టైల్ ఆఫ్ మేకింగ్ ని నేను ఈ సినిమాలో ఫాలో అయ్యాను అని చెప్పుకొచ్చారు.

    English summary
    Director Nandini denies copying the Hindi hit. "I never set out to make Band Baaja Baaraat and we never even got the feeling that it was similar when we were making the movie, says the director. But then there is too much of a similarity (the wedding planning backdrop et al), isn't it? "Look to start with, Sid and Sam play event managers in the movie and not wedding planners. They plan college fresher's parties, corporate dos, Sashtipurthi functions and baby showers. The company with which we signed an in-film branding deal with is also an event management company. I wanted a backdrop of event management because it adds colour and vibrancy to the movie. In any case, there have been many Hollywood movies with have been set in the backdrop of wedding planning. It just so happened that BBB is the only Hindi movie to have used that backdrop," defends Nandini.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X