»   »  రానాతో ఆ రీమేక్ చేయడంలేదు: నందినీరెడ్డి

రానాతో ఆ రీమేక్ చేయడంలేదు: నందినీరెడ్డి

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్, హాట్ లేడీ దీపిక పడుకొనె హీరో హీరోయిన్లుగా రూపొందిన హిందీ చిత్రం 'యే జవానీ హై దివానీ' ప్రస్తుతం విడుదలై హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు నిర్మాతలకు కోట్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మన తెలుగు హీరో రానా ఓ చిన్న గెస్ట్‌రోల్‌లో కనిపించాడు.

కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న ఓ పుకారు ఏమిటంటే....'యే జవానీ హై దివానీ' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనే ప్లాన్స్ జరుగుతున్నాయని, ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించనుందని, అక్కడ గెస్ట్‌రోల్‌లో కనిపించిన హీరో రానాను ఇక్కడ హీరోగా చూపిద్దామనే ప్రయత్నం జరుగుతోందని, సురేష్ బాబు ఈచిత్రాన్ని నిర్మించే అవకాశాలున్నాయని' వార్తలు వినపడ్డాయి.

అయితే ఈ వార్తలను తాజాగా నందినీరెడ్డి ఖండించారు. 'యే జవానీ హై దివానీ చిత్రాన్ని తాను రీమేక్ చేయడం లేదని స్పష్టం చేసారు. జబర్‌దస్త్ చిత్రం తర్వాత, తన నెక్ట్స్ సినిమాకు స్క్రిప్టు రాసే పనిలో ఉన్నానని, రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టెనర్‌ తన రాబోయే చిత్రం ఉంటుందని'నందినీ రెడ్డి తెలిపారు.

మరో నెల రోజుల్లో తన తర్వాతి సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని, ప్రస్తుతానికి కేవలం స్క్రిప్టు పనిలో మాత్రమే ఉన్నానని, ఎవరితో చేయాలనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. 'యే జవానీ హై దివానీ' రీమేక్ చేస్తున్నాననే రూరమ్ ఎలా పుట్టిందో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చింది.

English summary
Refusing rumours that her next directorial venture is a remake of Hindi blockbuster Yeh Jawaani Hai Deewani, Telugu director Nandini Reddy said she is currently scripting a romantic-comedy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu