»   » కొత్త కాపీ వివాదంలో 'అలా మొదలైంది' నందినీ రెడ్డి

కొత్త కాపీ వివాదంలో 'అలా మొదలైంది' నందినీ రెడ్డి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సిద్దార్ద్ తో చేసిన జబర్ధస్త్ చిత్రంతో ఆ మధ్యన కాపీ వివాదంలో ఇరుక్కున్న దర్శకురాలు నందినీ రెడ్డి ని మరోసారి కొత్తగా కాపీ వివాదం చుట్టుముట్టింది. ఈ సారి ఆమె నాగశౌర్య హీరోగా దామోదర ప్రసాద్ నిర్మాతగా ఓ చిత్రం చేస్తోంది. ఈ చిత్రం కథ ..హనుమాన్ చౌదరి అనే నూతన దర్శకుడుది అని సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ మేరకు రైటర్స్ అశోశియేషన్ లో దర్శకుల సంఘం లో గత కొద్ది నెలలుగా కాపీ వివాదం నడుస్తున్నట్లు తెలుస్తోంది. దాసరి గారి వంటి పెద్ద స్ధాయి సినీ పెద్దలు వద్దకు సైతం ఈ వివాదం వెళ్ళింది. అయితే ఇప్పటి వరకూ తేలలేదని అంటున్నారు. ఈ చిత్రానికి కళ్యాణ వైభోగమే అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం.

 Nandini Reddy in New Copy Trouble?!

వివాదంలోకి వెళితే.. రచయిత లక్ష్మీ భూపాల్ తో కలిసి తాను ఓ కథను రూపొందించి దాంతో విష్ణు హీరోగా సినిమా తీయటానికి రెడీ అవుతున్నా..అయితే ఈ లోగానే నా రచయితతో కలిసి నందినీరెడ్డి-దామోదర ప్రసాద్ లు కలిసి సినిమా తీయాలని చూస్తున్నారు. నాగశౌర్య హీరోగా నటించే ఈ సినిమా నాదేనని హనుమాన్ వాదిస్తున్నారు.

ప్రస్తుతం రచయితల సంఘంలో ఈ రెండు స్క్రిప్టులకు సంభందించిన పరిశీలనకు రెడీ అవుతున్నాయని సమాచారం. నాకు ఒకరి కథ కాపీ కొట్టి తీయాల్సిన అవసరం ఏంటని నందినీరెడ్డి వాదిస్తోందని అంటున్నారు.

నాగశౌర్య మాట్లాడుతూ...ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్‌ మీదున్నాయి. ఒకటి నందినీరెడ్డి దర్శకత్వంలో చేస్తున్న సినిమా అయితే, ఇంకొకటి రమేశ్‌వర్మ దర్శకత్వంలో చేస్తున్న సినిమా. ఈ రెండూ ముప్పావు వంతు పూర్తయ్యాయి అన్నారు.

English summary
Lady director Nandini Reddy coming up with a project starring Naga Sowrya in main lead, produced by KL Damodar Prasad. Writer cum director Hanuman Chowdary currently planned to work with Manchu Vishnu on a project is appalled having known that Nandini Reddy is shooting the story/script pretty same as his.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu