»   » తెలుగులో హిందీ మీడియం: విక్టరీ వెంకటేష్ ఒప్పుకుంటాడా??

తెలుగులో హిందీ మీడియం: విక్టరీ వెంకటేష్ ఒప్పుకుంటాడా??

Posted By:
Subscribe to Filmibeat Telugu
Venkatesh Daggubati Planning To Remake Bollywood Movie 'Hindi Medium'

ఇంతకుముందు బాలీవుడ్ సినిమాలు తెలుగులోకి రావటమే గానీ మన సినిమాలు అటు వెళ్ళటం చాలా తక్కువగా ఉండేది. ఈ మధ్య మాత్రం పరిస్థితి మారింది అటూ ఇటూ "ఫ్లో" సమానంగా ఉంది. సౌత్ ఇండియా ఇండస్ట్రీ మీద గట్టిగానే దృష్టి పెట్టింది బాలీవుడ్. గతం లో బాలీవుడ్ నుంచి తెలుగులోకి వచ్చే సినిమాల విషయం లో సీరియస్ గా ఉన్నది వెంకటేష్ ఒక్కడే. ఈ మ‌ధ్య వెంకీ త‌న వ‌య‌సుకు త‌గిన క‌థ‌ల‌ను ఎంచుకుంటున్నాడు. మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ మూవీ దృశ్యం రీమేక్ తో వెంకీ మంచి హిట్ అందుకున్నాడు.

హిందీ మీడియం ను తెలుగులో రీమేక్

హిందీ మీడియం ను తెలుగులో రీమేక్

వెంకీ న‌టించిన గోపాల గోపాల, గురు చిత్రాలు బాలీవుడ్ హిట్ మూవీస్ ఓ మై గాడ్‌, సాలా ఖడూస్ ల రీమేక్ అన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా, మ‌రో బాలీవుడ్ రీమేక్ లో వెంక‌టేష్ న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇర్ఫాన్ ఖాన్ కీలక పాత్రలో న‌టించిన హిందీ మీడియం ను తెలుగులో రీమేక్ చేయ‌బోతున్నార‌ట‌.

 కమర్షియల్ గా మంచి స‌క్సెస్ సాధించింది

కమర్షియల్ గా మంచి స‌క్సెస్ సాధించింది

ఈ ఏడాది మేలో విడుద‌లైన హిందీ మీడియం మూవీ కమర్షియల్ గా మంచి స‌క్సెస్ సాధించింది. ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు దర్శకురాలు నందిని రెడ్డి ప్లాన్ చేస్తోంద‌ట‌. హీరో వెంక‌టేష్ కు ఈ సినిమా స‌రిగ్గా స‌రిపోతుంద‌ని, తెలుగు నేటివిటీకి కూడా ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందని నందిని భావిస్తోంద‌ట‌.

తెలుగు మీడియం

తెలుగు మీడియం

ఈ సినిమాకు తెలుగు మీడియం అని టైటిల్ కూడా ఖ‌రారైంద‌ట‌. వెంకటేష్ కూడా మంచి క‌థ ఉన్న చిత్రాల‌ను రీమేక్ చేయ‌డానికి ఆసక్తి చూపిస్తున్నందున ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఓ ప్ర‌ముఖ నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ని స‌మాచారం.

వెంకీ న‌టించ‌డం ఖాయ‌మే

వెంకీ న‌టించ‌డం ఖాయ‌మే

నందిని ఈ సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేస్తోంద‌ని, ఆ త‌ర్వాత వెంకీ స్క్రిప్ట్ ఫైన‌ల్ చేయ‌డ‌మే ఆలస్య‌మ‌ని స‌ద‌రు నిర్మాత త‌న మిత్రుల‌తో అన్న‌ట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే మ‌రో బాలీవుడ్ రీమేక్ లో వెంకీ న‌టించ‌డం ఖాయ‌మే. అయితే, ఈ సినిమా గురించి ఇప్ప‌టివ‌ర‌కు ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.

English summary
Nandini Reddy said to have approached Venkatesh for the remake of Hindi Medium. She is considering the title 'Telugu Medium' for the film as per the talk. It is interesting to see whether Venky gives green signal to this film or not.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu