For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శ్రీముఖితో మస్తుగా రొమాన్స్ చేశా.. ఈజీగా కనెక్ట్ అవుతుంది.. నందు

  By Rajababu
  |

  డిసెంబర్ 8 న భారీ ఎత్తున విడుద‌ల‌వుతోన్న బీటెక్ బాబులు. నందు, శౌర్య‌, శ్రీముఖి, రోషిణి ప్ర‌ధాన‌ పాత్ర‌ల్లో జేపీ క్రియేషన్స్ బ్యానర్ పై ధ‌న జమ్ము నిర్మించిన చిత్రం బీటెక్ బాబులు. శ్రీను ఈ మంది దర్శకత్వం వ‌హించారు. అన్ని ప‌నులు పూర్తిచేసుకుని తెలుగు రాష్ట్రాల్లో డిసెంబ‌ర్ 8న భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది.

   శ్రీముఖితో రొమాన్స్ చేశా..

  శ్రీముఖితో రొమాన్స్ చేశా..

  ఈ సంద‌ర్భం గా హీరో నందు మాట్లాడుతూ, ` పెళ్ళిచూపులు త‌ర్వాత చాలా మంచి పాత్ర ఈ సినిమాలో ద‌క్కింది. నా పాత్ర ప్ర‌తీ ప్రేమికుడిగా క‌నెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. శ్రీ ముఖికి ..నాకు మ‌ధ్య‌ వ‌చ్చే ప్రేమ స‌న్నివేశాలు హృద‌యాన్ని హ‌త్తుకుంటాయి. సీరియ‌స్‌గా ల‌వ్ ట్రాక్ న‌డుస్తూనే...న‌వ్వులు పువ్వులు పూయించే కామెడీ స‌న్నివేశాలు కూడా హైలైట్ గా ఉండేలా ద‌ర్శ‌కుడు చ‌క్క‌గా తెరకెక్కించారు. మంచి అవుట్ ఫుట్ వచ్చింది. సినిమాపై యూనిట్ అంతా చాలా న‌మ్మ‌కంగా ఉన్నాం. ప్రేక్ష‌కులు కూడా మాచిత్రాన్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.

   సరైనోడు స్పూప్ చేశా..

  సరైనోడు స్పూప్ చేశా..

  నటుడు ఆలీ మాట్లాడుతూ,` చాలా కాలం తర్వాత ఈ చిత్రంతో మ‌ళ్లీ స్పూప్ చేశా. స‌రైనోడు స్పూప్ అద‌రొట్టాన‌ని అంతా అంటున్నారు. ఇప్పటికే
  స్పూఫ్ ట్రైలర్‌కు సోషల్ మీడియాలో బాగా పాపుల‌ర్ అయింది. శ్రీను కొత్త కుర్రాడైనా అనుభ‌వం గ‌ల డైరెక్ట‌ర్‌లా క‌థ‌ను డీల్ చేశాడు. సినిమా విజయం సాధించి అంద‌రికీ మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నా` అని అన్నారు.

   ప్రియురాలు గొప్పదా? ప్రేమ గొప్పదా?

  ప్రియురాలు గొప్పదా? ప్రేమ గొప్పదా?

  చిత్ర దర్శకుడు శ్రీను ఈ మంది మాట్లాడుతూ, `మంచి కంటెంట్ తో తెర‌కెక్కించాం. ఇంజనీరింగ్ చ‌దువుకుంటోన్న న‌లుగురు విద్యార్ధుల జీవితాలు ఎలా ఉంటాయి? రెగ్యుల‌ర్ గా వాళ్ల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ప్రియురాలి ప్రేమ గొప్ప‌దా? త‌ల్లిదండ్రుల ప్రేమ గొప్ప‌దా? అనే అంశాల‌కు హాస్యం..సెంటిమెంట్ స‌న్నివేశాలు జోడించి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యే విధంగా తెర‌కెక్కించాం. ముఖ్యంగా యువ‌త‌ను టార్గెట్ చేసే సినిమా అవుతుంది. ఇప్ప‌టికే రిలీజైన ప్ర‌చార చిత్రాల‌కు అంద‌రి నుంచి మంచి స్పంద‌న ల‌భించింది. చిన్న సినిమా అయినా క్వాలిటీ పరంగా నిర్మాత‌లు ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు. డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు వ‌స్తున్నాం. తప్ప‌కుండా మా సినిమాని అంద‌రూ ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాం` అని అన్నారు.

   శంకర్ ఫ్రమ్ శ్రీకాకుళంగా

  శంకర్ ఫ్రమ్ శ్రీకాకుళంగా

  శకలక శంకర్ మాట్లాడుతూ, ` శంకర్ ఫ్రమ్ శ్రీకాకుళం గా అనే పాత్ర‌లో క‌నిపిస్తాను. క్యారెక్ట‌రైజేష‌న్ కొత్త‌గా ఉంటుంది. ఇందులో ద‌ర్శ‌కుడు నాతో చిన్న చిన్న స్టెప్పులు కూడా వేయించారు. సెంటిమెంట్ స‌న్నివేశాలు హైలైట్ గా తీర్చిదిద్దారు. సినిమా తప్ప‌కుండా పెద్ద విజ‌యం సాధిస్తుంది` అని అన్నారు.

  తాగుబోతు కామెడీ దొంగగా

  తాగుబోతు కామెడీ దొంగగా

  తాగుబోతు రమేష్ మాట్లాడుతూ, ` ఇందులో తాగుబోతుగానే కాకుండా కామెడీ దొంగగా పూర్తి స్థాయిలో కనిపిస్తా. కథ నాతోనే మొద‌ల‌వుతుంది...నాతోనే ముగుస్తుంది. ఆనందో బ్రహ్మ తర్వాత రంగా ది దొంగగా అంద‌ర్నీ మెప్పిస్తాను. డిసెంబ‌ర్ 8న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాం` అని అన్నారు.

  ఈ చిత్రంలో అలీ, శ‌క‌ల‌క శంక‌ర్, తాగుబోతు ర‌మేష్‌, వైజాగ్ శంక‌ర్, వైవా హ‌ర్ష‌, సూర్య‌, జ‌బ‌ర్ ద‌స్త్ రాఘ‌వ‌, ప‌టాస్ ప్ర‌కాశ్, నోవ‌ల్ కిషోర్, రాణి, ఖుష్బు, ప‌విత్ర లోకేష్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

  English summary
  B.Tech Babulu is an upcoming Telugu movie. The movie is directed by Srinu Imandi and will feature Nanudu, Sree Mukhi Sharyaa, Roshini and Ashwini as lead characters. Other popular actors who have been roped in for B.Tech Babulu are Vizag Shankar, Naval Kishore, Shakalaka Shankar and R. P. Patnaik.This movie is set to release on December 8th 2017
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X