»   » నాని 'ఆహా కల్యాణం' రిలీజ్ డేట్

నాని 'ఆహా కల్యాణం' రిలీజ్ డేట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలీవుడ్ సినిమా 'బ్యాండ్ బాజా బారాత్'కు అధికారిక రీమేక్ అయిన 'ఆహా కల్యాణం'లో నాని హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది తమిళ, తెలుగు భాషల్లో తయారవుతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్, ట్రైలర్ ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేయటానికి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒరిజినల్‌ను నిర్మించిన ప్రతిష్ఠాత్మక బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న తొలి దక్షిణాది చిత్రమిది. గోకుల్‌కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వాణీ కపూర్ హీరోయిన్.

నాని మాట్లాడుతూ... "యశ్‌రాజ్ ఫిలిమ్స్ (వై.ఆర్.ఎఫ్.) తొలి సౌత్ ఇండియన్ మూవీలో హీరోనైనందుకు గర్వంగా ఉంది. ముంబైలో వారి స్టూడియోని సందర్శించడం మరచిపోలేని అనుభూతి. అది పెద్ద ఎగ్జిబిషన్‌ను చూసినట్లే అనిపించింది. వై.ఆర్.ఎఫ్. అధినేత ఆదిత్య చోప్రాతో మూడు గంటల సేపు మాట్లాడే అవకాశం లభించింది. మా సినిమాకి సంబంధించిన ప్రతి చిన్న విషయం గురించి ఆయన మాట్లాడుతుంటే ఆ సంస్థ ఎందుకు ఆ స్థాయికి ఎదిగిందన్నది అర్థమైంది.ఇప్పటికే ఫ్రీమేక్‌గా రూపొందిన తెలుగు సినిమా ('జబర్‌దస్త్')ని నేను చూడలేదు. " అన్నారు.

Aaha Kalyanam

ఈ చిత్రం పిభ్రవరిలో విడుదల కానుంది. ఈ రీమేక్ లో నటించడానికి యష్ రాజ్ ఫిల్మ్స్ రూ. 2.5 కోట్లు ఆఫర్ చేసిందనే వార్త ఆ మధ్యన టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరియర్ ప్రారంభించి, అతి తక్కువ కాలంలో టాలీవుడ్ లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న నాని, ఈగ సినిమా సూపర్ హిట్ అవడంతో అటు కోలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోను కూడా నానికి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం "జండా పై కపిరాజు", "పైసా" సినిమాలలో నటిస్తున్నాడు.


ఇక ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న నలుగురు యువకుల కథతో దర్శకుడు సిరాజ్‌కల్లా తెరకెక్కించిన చిత్రం డీ ఫర్‌ దోపిడి. వరుణ్‌సందేశ్‌, సందీప్‌కిషన్‌ ప్రధానపాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈనెల 25న విడుదల కానుంది. ఆద్యంతం నవ్వులు పంచుతూ సాగే ఈ దోపిడీ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది. ఈ చిత్రానికి నాని సహ నిర్మాతగా వ్యవహరించడం, దిల్‌రాజు ఈ చిత్రాన్ని పంపణీ చేస్తుండటం విశేషం.

English summary
Nani’s upcoming film Aaha Kalyanam is all set to hit the screens on February 7. The film has been made in Tamil under the same name and Yash Raj Films, which is making its foray in South, has produced the Tamil and Telugu versions. Gokul Krishna has directed the film and it’s the official remake of ‘Band Baaja Baarat’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu