»   »  రాజమౌళి ట్వీట్: కట్టప్ప గురించి నాని సెటైర్

రాజమౌళి ట్వీట్: కట్టప్ప గురించి నాని సెటైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాని ప్రధాన పాత్రలో నటించిన 'భలే భలే మగాడివోయ్' సినిమా సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దమవుతున్న నేపథ్యంలో రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా సినిమాను ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్ అద్భుతంగా ఉందని, సినిమాలో నాని మతిమరుపు వీరుడైతే... నిజ జీవితంలో తానో పెద్ద బ్రాండెడ్ గజినీ'నని రాజమౌళి ట్విట్టర్ ద్వారా చమత్కరించారు.

రాజమౌళి ట్వీట్‌కు నాని రిప్లై ఇస్తూ... 'హహహ...సార్, అన్నీ మర్చిపోతే మర్చిపోయారు...కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో చెప్పడం మాత్రం మర్చిపోయారో ఇంక అంతే' అంటూ సమాధానమిచ్చాడు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపారనే విషయం గత కొంత కాలంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.

 Nani about Baahubali Kattappa character

నాని -అందాల రాక్షసి ఫేం లావణ్య త్రిపాఠీ జంటగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు మారుతి. మారుతి సినిమా అనగానే డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయని అంతా భావిస్తారు కానీ అనూహ్యంగా ఈ చిత్రానికి క్లీన్ ''యు '' సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు . సినిమా మొత్తం వినోదాత్మకంగా ఉంటుందని తెలుస్తోంది .

మురళిశర్మ, సితార, నరేష్, స్వప్నమాధురి, శ్రీనివాసరెడ్డి, వెన్నెలకిశోర్, ప్రవీణ్, షకలక శంకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: ఉద్ధవ్, కెమెరా: నిజార్ షఫీ, సంగీతం: గోపీ సుందర్, నిర్మాత: బన్నీవాసు, రచన, దర్శకత్వం: మారుతి.

English summary
Nani Reply to Rajamouli about Baahubali Kattappa character.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu