»   » మనం ఎన్ని అనుకొన్నా... : నాని

మనం ఎన్ని అనుకొన్నా... : నాని

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : నెల వ్యవధిలోనే నా మూడు సినిమాలు పైసా', 'ఆహా కళ్యాణం', 'జెండాపై కపిరాజు'... ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయంటే నేను ఎంత సంతోషంగా ఉంటానో అర్థం చేసుకోండి. ఆర్నెళ్లకో సినిమా విడుదలయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసుకొని నటించాను. కానీ మనం ఎన్ని అనుకొన్నా... పైవాడి స్కెచ్‌ వేరే ఉంటుంది కదా? అందుకే ఇలా వరుసగా సినిమాలొస్తున్నాయి. ఏం జరిగినా అంతిమంగా ఓ అద్భుతమైన మేలు జరుగుతుందన్నది నా ప్రగాఢ నమ్మకం అన్నారు హీరో నాని. ఆయన నటించిన 'ఆహా కళ్యాణం' ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

  ఆహా కళ్యాణం' గురించి చెప్తూ...ఒక వేడుకలాంటి సినిమా ఇది. పెళ్లి మంటపంలోకి వెళితే ఆ సందడి ఎలా ఉంటుందో... ఈ సినిమా చూశాక కూడా అదే అనుభూతి కలుగుతుంది. వ్యక్తిగతంగా నా మనసుకు బాగా దగ్గరైన పాత్ర. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన చుట్టూ రకరకాల ఆందోళనలు. వాటన్నిటినీ మరిచిపోయి హాయిగా రెండున్నర గంటలపాటు నవ్వుకొనేలా చేసే చిత్రమిది. మనసులో బోలెడన్ని కలలు, వాటిని ఎలా నెరవేర్చుకోవాలో తెలియని ఓ కుర్రాడికి అందంతో పాటు బాగా తెలివితేటలున్న ఓ అమ్మాయి తోడైతే ఎలా ఉంటుందన్నది ఈ సినిమాలో చూడొచ్చు అన్నారు.

  Nani about his latest Aha Kalyanam

  అలాగే... ''ఒక వేడుకలాగా సాగే సినిమా ఇది. ధరన్‌ కుమార్‌ స్వరపరిచిన గీతాలకు చక్కటి స్పందన లభిస్తోంది. ఇది నాకు ప్రత్యేకమైన చిత్రం. సవాల్‌తో కూడిన పాత్రను పోషించాను. రీమేక్‌ సినిమా చేయడం ఆషామాషీ కాదు. మాతృక కంటే రెండింతలు కష్టపడాల్సి ఉంటుంది. నిజానికి మనకున్నది ఐదారు కథలే. వాటితోనే వేలాది చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకాదరణ పొందాయి. అందులో ఈ సినిమా కూడా ఒకటి అవుతుంది. మన దక్షిణాది వాతావరణానికి తగ్గట్టుగా చక్కటి వెటకారం, వినోదం మేళవింపుతో ఈ చిత్రం సాగుతుంది. ఇంటిల్లిపాదినీ అలరిస్తుందన్న నమ్మకం నాకుంది. వాణికపూర్‌ ప్రతీ చిన్న విషయంపైనా శ్రద్ధ చూపిస్తూ నటించింది'' అన్నారు. ''యశ్‌రాజ్‌ సంస్థలో నేను చేస్తున్న రెండో చిత్రమిది. 'ఆహా కళ్యాణం'లాంటి ఓ మంచి చిత్రంతో దక్షిణాదిన పరిచయం అవుతుండడం ఆనందంగా ఉంది'' అన్నారు వాణీకపూర్‌.

  English summary
  Nani said that he is confident that Aha Kalyanam film will appeal to the Telugu audiences. This film is based on Bollywood film Band Bajaa Baraat, which starred Ranveer and Anushka Shetty. Siddarth and Samantha starrer Jabardasth, which came to the screens last year, was also on similar lines.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more