»   » రవితేజ, నాగార్జునా కాదన్న కథనే నానితో... దిల్ రాజు పట్టుదల అదీ

రవితేజ, నాగార్జునా కాదన్న కథనే నానితో... దిల్ రాజు పట్టుదల అదీ

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  వేణు శ్రీరాం గుర్తున్నాడా... ఓ మై ఫ్రెండ్ అంటూ వచ్చిన ఈ దర్శకుడు ఆ ఫ్లాప్ దెబ్బకి కుదేలైపోయాడనుకున్నారంతా కానీ తన ప్రయత్నాలని తాను సైలెంట్ గా చేస్తూనే ఉన్నాడు. ఆ మధ్య ఈ దర్శకుడు ఓ కథ రాసుకున్నాడు. అది ఎలాంటి కథ అనేది ఎవరికీ తెలీదు. కానీ హీరోలు మాత్రం ఆ కథ విన్నాక తప్పుకుంటూనే ఉన్నారు. ఇప్పటికే రవితేజ, నాగార్జున ఆ కథ విన్నారు. మొదట సినిమా చేయడానికే ఒప్పుకున్నారు. కానీ తర్వాత తప్పుకున్నారు. అలాంటి కథతో ఇప్పుడు సినిమా చేయడానికి నాని రెడీ అవుతున్నాడు. వేణు శ్రీరాం చెప్పిన కథకు మొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రవితేజ నే

  . ఆమధ్య ఇదే కథతో రవితేజ సినిమా ఓకే చేశాడు. ఆ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఇక సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం అనుకుంటున్న టైంలో సడెన్ గా ప్రాజెక్టు నుంచి రవితేజ తప్పుకున్నాడు. దిల్ రాజు ఈ కథనే నమ్మి వేణూ శ్రీరాం కి అండగా నిలబడ్డాడు ఈ కత్థనే 'ఎవడో ఒకడు' అనే సినిమా గా రవితేజతో చేయాలనుకున్నాడు దిల్ రాజు. కానీ కొన్ని కారణాల వలన అది కుదరలేదు. రెమ్యున రేషన్ ప్రాబ్లం వల్లనే అని బలమైన టాక్ అయితే వినిపించింది గానీ పక్కా క్లారిటీ అయితే లేదు. స్క్రిప్ట్ రెడీగా ఉండటంతో ఈ కథను నాగార్జునతో తెరకెక్కించాలని దిల్ రాజు అనుకున్నాడు. నాగార్జున దగ్గరికి ఈ కథ వెళ్లగా ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదు.

  Nani

  ఐతే ఇలా కాంబినేషన్ కుదరనంత మాత్రాన వదిలే రకం కాదు దిల్ రాజు. తన ప్రొడక్షన్లో సినిమా చేసిన ప్రతి దర్శకుడికీ సక్సెస్ ఇచ్చి పంపిస్తానని నొక్కి వక్కాణించే దిల్ రాజు.. వేణు శ్రీరామ్ విషయంలోనూ అదే పట్టుదలతో ఉన్నట్లున్నాడు. 'ఓ మై ఫ్రెండ్' లాంటి ఫ్లాప్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన వేణు శ్రీరామ్‌తో రెండో సినిమా చేసే విషయంలో ఆయన వెనక్కి తగ్గట్లేదు. రవితేజ, నాగార్జునలతో కుదరని ఈ కథను నానితో తెరకెక్కించాలని దిల్ రాజు భావిస్తున్నాడు. దిల్ రాజు బేనర్లో నాని ప్రస్తుతం 'నేను లోకల్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే అతడికి వేణు శ్రీరామ్ కథ చెప్పి ఒప్పించినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటన వచ్చే అవకాశముంది.

  ఈ కథపై నమ్మకం వున్న దిల్ రాజు, ఎలాగైనా తెరకెక్కించాలనే పట్టుదలతో వున్నాడు. నానికి ఈ కథ సరిగ్గా సరిపోతుందని భావించిన దిల్ రాజు, ఆయనని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడట. అయితే ఇక్కడ ఒక ట్విస్టు కూడా ఉంది మరి. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలోనే నాని 'నేను లోకల్' సినిమా చేస్తున్నాడు. అందువలన నాని ఓకే అనేసినా, దీనికంటే ముందుగా అంగీకరించిన మూడు సినిమాల తరువాత ఈ సినిమా చేయవలసి ఉంటుంది. మరి అప్పటివరకూ దిల్ రాజు ఆగుతాడా లేకుంటే నాని తర్వావత ఇంకో పేరు వినిపిస్తుందా అనేదే డౌటు! మొత్తానికి వేణూ శ్రీరాం కి బ్రేక్ ఇచ్చే కథ లాగానే ఉంది దిల్ రాజు నమ్మకం చూస్తూంటే మరి... రవి తేజా, నాగార్జునా ఈ కథ ని ఒప్పుకోక పోవటానికి కారణం నిజంగానే రెమ్యునరేషన్ ప్రాబ్లమే అయి ఉంటుందా..??

  English summary
  As per latest reports, the 'Majnu' actor has agreed to act in a new film to be directed by Venu Sriram. This name sounds familiar, right? He is that Dil Raju prodigy who made his directorial debut with Raju's production venture 'Oh My Friend'. After the failure of that project, he has been waiting with bated breath for another chance.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more