twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కృష్ణవంశీ ‘పైసా’లో నాని పాత్ర ఏంటి

    By Srikanya
    |

    హైదరాబాద్ కృష్ణవంశీ,నాని కాంబినేషన్ లో ప్రస్తుతం 'పైసా'అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తన పాత్ర డిఫెరెంట్ గా ఉంటుందని నాని చెప్తూ...కృష్ణవంశీ దర్శకత్వంలో చేస్తున్న 'పైసా' నాకు పూర్తి స్థాయి వృత్తి సంతృప్తినిచ్చింది. పాతబస్తీలో ఓ షేర్వాణీ షాపు మోడల్‌గా ఇందులో కనిపిస్తా. ఇందులో సరికొత్త నానీని చూస్తారు అన్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాని, సమంత జంటగా సి.కల్యాణ్ నిర్మించిన 'ఎటో వెళ్లిపోయింది మనసు' ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా నాని మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

    అలాగే అందరూ నడిచే దారిలో వెళ్లడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. నాకంటూ ఓ ప్రత్యేక బాణీ ఉండాలనేది నా కోరిక. ఏదైనా నాకు కథే ప్రధానం. కృష్ణవంశీని కూడా నేను కథ అడిగాను. ఒక్క మణిరత్నం తప్ప ఎవ్వరైనా సరే కథ తెలుసుకునే సినిమాలు చేస్తాను అని చెప్పుకొచ్చారు.

    'ఎటో వెళ్లిపోయింది మనసు' గురించి చెపుతూ...ఇది మూడు దశల ప్రేమ కథ. 8 నుండి 28 ఏళ్ల మధ్యలో జరిగిన ప్రేమను ఇందులో ఆవిష్కరించారు. నేను, సమంత అస్సలు కనబడం. మేం పోషించిన వరుణ్, నిత్య పాత్రలే ప్రేక్షకుల్ని వెంటాడతాయి. ఈ సినిమా చూస్తుంటే దాదాపుగా అందరికి వాళ్ల ప్రేమకథలు గుర్తుకు రావడం ఖాయం. గౌతమ్ మీనన్ నా అభిమాన దర్శకుల్లో ఒకరు. ఆయన దగ్గర సహాయ దర్శకునిగా చేరాలని ఎన్నో కలలు కన్నాను. ఇప్పుడేమో ఆయన సినిమాలోనే హీరోగా చేశాను. అంతా కాలమహిమ. మనం ప్లాన్ చేసినంత మాత్రాన ఇవన్నీ జరగవు. గౌతమ్ మీనన్‌తో నా బంధం ఎంతలా ముడిపడిందంటే, మళ్లీ మేమిద్దరం కలిసి ఓ సినిమా చేయబోతున్నాం అన్నారు.

    'గౌతమ్ మీనన్ 'ఎటో వెళ్లిపోయింది మనసు' కథ చెబుతూ ఉంటే నా మనసు ఎటో తేలిపోయింది. ఆయన నా ప్రేమకథను నాకే చెబుతున్నట్టుగా అనిపించింది. వెంటనే నా లైఫ్ పార్టనర్ అంజనకు ఫోన్ చేసి 'ఇదేదో మన ప్రేమకథలా ఉంది' అని చెప్పాను'' అన్నారు నాని. ఇక సముద్రఖని దర్శకత్వంలో 'జెండాపై కపిరాజు'లో తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నా. జీవితంలో ఒక్కసారే ఇలాంటి సినిమాలు వస్తాయి. గోకుల్ దర్శకత్వంలో 'బ్యాండ్ బాజా బారాత్' హిందీ రీమేక్‌ను తెలుగు, తమిళ భాషల్లో చేయబోతున్నాను అని చెప్పుకొచ్చారు.

    English summary
    
 Nani is playing the role of a sherwani model from Old City in Krishna Vamsi’s upcoming film. which is set in the backdrop of the current political scenario. Charan Raj is playing the villain’s role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X