»   » నాని 'భీమిలి కబడ్డీ జట్టు' ఏం చేస్తోంది?

నాని 'భీమిలి కబడ్డీ జట్టు' ఏం చేస్తోంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళంలో హిట్టయిన వెన్నెల కబడ్డి కూటం చిత్రాన్ని తెలుగులో 'భీమిలి కబడ్డీ జట్టు' పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. నాని, శరణ్యామోహన్, కీర్తన, కిషోర్ ముఖ్య పాత్రలుగా మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ ప్రై. లిమిటెడ్ ఈ చిత్రం నిర్మిస్తోంది. ఇక ఈ 'భీమిలి కబడ్డీ జట్టు' షూటింగు పూర్తిచేసుకుని, డబ్బింగ్ పనుల్ని జరుపుకుంటోంది. ఈ చిత్రం ద్వారా తాతినేని సత్య దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సందర్బంగా చిత్ర సమర్పకుడు ఆర్.బి. చౌదరి మాట్లాడుతూ "దర్శకుడు సత్య ఓ చక్కని చిత్రంగా దీన్ని రూపొందించి, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ చిత్రం తర్వాత అతను పెద్ద దర్శకుల జాబితాలో చేరిపోతాడు" అని చెప్పారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ నెలాఖరులో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రం ఆడియోను ఏప్రిల్ మొదటి వారంలో ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్నామనీ, సెల్వగణేశ్ చాలా చక్కని సంగీతాన్ని అందించారనీ మరో నిర్మాత పరాస్ జైన్ చెప్పారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu