»   » భలే ఫన్నీ :పాపం నాని...ప్రతీది కవర్ చేసుకుంటూ

భలే ఫన్నీ :పాపం నాని...ప్రతీది కవర్ చేసుకుంటూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాని,మారుతి కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం . 'భలే భలే మగాడివోయ్‌' ఈ శుక్రవారం మన ముందుకు వస్తోంది. ఈ సినిమాలో మతిమరుపు కుర్రాడిగా నటించి నవ్వులు పంచబోతున్నాడు. ఇందులోని నాని పాత్ర పేరు లక్కీ. పేరు అచ్చంగా అదేనా అంటే - కాదు.ఇంట్లోవాళ్లు 'లక్కరాజు' అంటూ పాత చింతకాయ పచ్చడి లాంటి పేరు పెడితే... దానికి స్త్టెలిష్‌గా తాలింపు వేసి లక్కీ అని మార్చుకొన్నాడన్నమాట.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


అలాగే నాని ఈ చిత్రంలో బుల్లి సైంటిస్ట్‌ . మొక్కలకు సంబంధించిన పరిశోధనలు చేస్తుంటాడన్నమాట. అతనిలో ఓ లోపం ఉంది. అన్నీ గుర్తున్నట్టే ఉంటాయి కానీ ఉండవు. ఓ పనిచేస్తున్నప్పుడు.. రెండో పని ఎంటరైతే. మొదటిది మర్చిపోతా. అదేంటో గుర్తు తెచ్చుకొనే పనిలో రెండోదీ మర్చిపోతూంటాడు.


Nani Character in Bale Bale Magadivoy movie

ఈ మతిమరుపు వల్ల చిన్నప్పుడు కొన్ని కుటుంబాలే విడిపోయాయ్‌. ప్రాణస్నేహితులు కొట్టుకొని శత్రువులుగా మారిపోయారు. నాని మాత్రం అవన్నీ మర్చిపోయి.. సక్సెస్‌ఫుల్‌గా పెరిగి పెద్దవాణ్ని అయిపోయ్యాడు. నానితో పాటు మతిమరుపు కూడా పెద్దదయ్యింది.


పొద్దుటే ఆఫీసుకు వెళ్లేటప్పుడు షూస్‌ మర్చిపోయి.. చెప్పులేసుకెళ్లి...సాక్సుపై చెప్పులేసుకెళ్తాడు. గుడికెళ్లి వస్తూ వస్తూ ఎవరిదో సైకిల్‌ తెచ్చేశాడు. ఇంటికి కొత్త సైకిల్‌ వచ్చిందని అందరూ సంతోషించాలి కదా.. కానీ 'బంగారం లాంటి బండి వదిలేసి సైకిలేసుకొచ్చావేంట్రా..' అంటూ నానివైపు జాలిగా చూస్తారు.


క్రికెట్‌ చూస్తూ చూస్తూ అదేంటి..? 'పుల్లెల గోపీచంద్‌ ఇంకా బ్యాటింగ్‌కి రాలేదేంటి?' అనుకొంటాడు. తను క్రికెటర్‌ కాదన్న సంగతి నానికు గుర్తుంటే కదా.?ఇలా జీవితంలో అన్నీ మర్చిపోవడమే తెలిసిన నానికు.. ఓ అందాల రాశి పరిచయం అయ్యింది. అదేంటో ఆ అమ్మాయిని మాత్రం మర్చిపోలేకపోతున్నాడు.


Nani Character in Bale Bale Magadivoy movie

ఆ అమ్మాయికీ నాని అంటే ఇష్టమే. అందుకే వారి లవ్‌ తొందర్లోనే ట్రాక్‌లో పడిపోయింది. కానీ నానికి తనో గజిని అనే నిజం ఆమెకి తెలిసిపోతే తను నానికెక్కడ దూరమైపోతుందో అనే భయం. అందుకే సాధ్యమైనంత వరకూ నా మతిమరుపుని కవర్‌ చేశాడు.ఓరోజు ఫోన్‌ చేసింది. మాటల మధ్యలో 'నన్నోసారి ప్రేమగా పేరు పెట్టి పిలుస్తావా?' అని అడిగింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి అంత ప్రేమగా అడిగేసరికి.. మనసులోంచి ప్రేమ పొంగుకొచ్చేసింది. కానీ తన పేరు మాత్రం గుర్తుకు రాలేదు.


'తొలిసారి నిన్ను పేరు పెట్టి పిలిచే సందర్భం ఎంత ప్రత్యేకంగా ఉండాలి? ఇలా ఫోన్‌లో పిలిస్తే మజా ఎక్కడి నుంచి వస్తుంది' అంటూ కాస్తలో కవర్‌ చేసుకొన్నాడు. ఇలా ఒకటా, రెండా.. నాని మతిమరుపుకి ఎదురైన సవాళ్లు ఎన్నో. అవన్నీ నానిని ఏడిపించినా మిమ్మల్ని మాత్రం బాగా నవ్విస్తాయి.


నాని కవరింగులకు, క్లవరింగులకూ ప్రేమించిన అమ్మాయి నానికు పూర్తిగా పడిపోయే సందర్భంలో నాని జీవితంలో ఓ భయంకరమైన ట్విస్టు వచ్చిపడింది. అదేంటో మీకు 'భలే భలే మగాడివోయ్‌' సినిమా చూస్తేనే అర్థమవుతుంది. 

English summary
Bale Bale Magadivoy is the upcoming movie starring Nani and Lavanya Tripathi in the lead roles. The movie is directed by Maruthi who got into fame with Ee Rojullo, Bustop, and Kotha Janta. The movie is produced by Geetha Arts & UV Creations.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu