For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అరేయ్ ఏందిరా? దిల్ రాజు ఫైర్... కూల్‌గా నచ్చజెప్పిన నాని.... కొట్టాలన్న ఎర్రబెల్లి!

  By Bojja Kumar
  |

  నాని, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'ఎంసీఏ - మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి'. వేణు శ్రీరామ్‌ దర్శకుడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. దిల్‌రాజు, శిరీష్‌, లక్ష్మణ్‌ నిర్మాతలుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో తెరకెక్కిన ఈచిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ శనివారం వరంగల్‌లో జరిగింది. డిసెంబర్ 21న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ వేడుకకు అభిమానులు భారీగా తరలి వచ్చారు.

  ఫైర్ అయిన దిల్ రాజు

  ఫైర్ అయిన దిల్ రాజు

  స్టేజీ మీద దిల్ రాజు ప్రసంగిస్తుండగా కొందరు అభిమానులు బాగా అల్లరి చేయడంతో దిల్ రాజు కాస్త ఆగ్రహానికి గురయ్యారు. ‘అరేయ్ ఏంది రా బై.. కొంచెం గమ్మునుండడ్రా...మనకు గిట్ల చెబితే కానీ అర్థం కాదా?'.... అంటూ తన ప్రసంగం కొనసాగించారు. అయినా ఫ్యాన్స్ అల్లరి ఆగక పోవడంతో.... ‘ఏయ్ అర్థం కాదా? మాట్లాడనివ్వండి. మీరు ఇలా అల్లరి చేస్తే వరంగల్ లో ఫంక్షన్లు ఉండవు, షూటింగులు ఉండవు. సినిమా ఇండస్ట్రీ మొత్తం షూటింగుల కోసం వరంగల్ వచ్చేలా ఉండాలి, మీరు ఇలా చేస్తే ఎలా? అని దిల్ రాజు అసహనం వ్యక్తం చేశారు.

  దిల్ రాజును పట్టించుకోవద్దన్న నాని

  దిల్ రాజును పట్టించుకోవద్దన్న నాని

  దిల్ రాజు తర్వాత మైక్ అందుకున్న నాని మాట్లాడుతూ... ‘రాజు గారు అలాగే చెబుతారు. ఆయన్ను మీరు పట్టించుకోవద్దు. హైదరాబాద్ నుండి వరంగల్ వచ్చి ఫంక్షన్ చేస్తుంది మీరు సైలెంటుటగా ఉంటారనా? ఈ రోజు ఈ మిడిల్ క్లాస్ అబ్బాయికి దొరుకుతున్న సపోర్టు చూస్తుంటే....ప్రతీ మిడిల్‌ క్లాస్‌ అబ్బాయీ హీరో అయిపోయినంత ఆనందంగా ఉంది. ‘ఎంసీఏ' మొత్తం వరంగల్‌లోనే తీశాం. ఇంత దూరంగా వచ్చినా ఏనాడూ ఇంటిని మిస్‌ అయినట్టు అనిపించలేదు. మీరు అందరూ ఇచ్చిన సపోర్టుకు థాంక్స్. ఎన్ని జన్మలున్నా మీ రుణం తీర్చుకోలేను. దిల్‌రాజుతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈయేడాది ఆయనతో రెండు సినిమాలు చేసే అవకాశం దక్కింది. ఈ సినిమాతో సాయి పల్లవి నా అభిమాన నటి అయిపోయింది. తనతో చేసిన సన్నివేశాల్ని ఆస్వాదించాను. వేణు కథ చెప్పినప్పుడు నాకు నేను కనిపించారు. ప్రేక్షకులు కనిపించారు. వాళ్లకు నచ్చే సినిమా అవుతుంది' అన్నారు.

  డబుల్ హ్యాట్రిక్ కొడుతున్నాం

  డబుల్ హ్యాట్రిక్ కొడుతున్నాం

  శతమానం భవతి సినిమా పేరెంట్స్ గురించి చెప్పాం. ఫిదా సినిమాలో నాన్న కూతుళ్ల గురించి చెప్పాం. ఈ ఎంసీఏ సినిమా అన్నా, వదినా, మరిది కథ. మళ్లీ సకుటుంబ సమేతంగా చూసే సినిమా. ఫస్టాఫ్ చాలా ఎంటర్టెనింగ్ ఉంటుంది. సెకండాఫ్ లో అందరినీ టచ్ చేసే కథ ఉంటుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా వరుసగా 5 సినిమాలు సక్సెస్ కొట్టాం. ఇపుడు సినిమాతో డబుల్ హ్యాట్రిక్ కొడుతున్నాం.... అని దిల్ రాజు తెలిపారు.

  సాయి పల్లవి

  సాయి పల్లవి

  ‘‘దర్శకుడు వేణు కష్టపడి ఓ మంచి సినిమా తీశారు. భూమిక నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఆమె ఇంకా సినిమాలు చేయాలి. నన్ను కూడా ఓ తెలుగు అమ్మాయిలా ఆదరిస్తున్నందుకు థాంక్స్. నాని చాలా హార్డ్ వర్కర్. ప్రతి సీన్ చేసే ముందు దాన్నిఎలా డెవలప్ చేయాలని ఆలోచిస్తారు.'' అని సాయి పల్లవి అన్నారు.

  మిడిల్ క్లాస్ సినిమా ఇది

  మిడిల్ క్లాస్ సినిమా ఇది

  ‘‘ఎంసీఏ అంటే మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి, అమ్మాయి కాదు. మిడిల్‌ క్లాస్‌ ఆడియన్స్‌. మిడిల్‌ క్లాస్‌ అనేది స్థాయి కాదు. అదో మైండ్‌ సెట్‌. మధ్యతరగతి మనస్తత్వం ఉన్న వాళ్లందరికీ ఈ సినిమా నచ్చుతుంది'' అని దర్శకుడు వేణు శ్రీరామ్ అన్నారు.

  దిల్ రాజు మీద కొపం ఉంది, శిరీష్-లక్ష్మణ్‌లను కొట్టాలి

  దిల్ రాజు మీద కొపం ఉంది, శిరీష్-లక్ష్మణ్‌లను కొట్టాలి

  ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన పొలిటీషియన్ ఎర్రబెల్లి దయాకర్ రావు సరదా కామెంట్స్ చేశారు. ‘నాకు దిల్ రాజు మీద కొపం ఉంది, శిరీష్-లక్ష్మణ్ లను కూడా ఒకసారి కొట్టాలి. ఎందుకంటే ‘ఫిదా' సినిమా ఇక్కడ తీస్తానని మాట ఇచ్చి మోసం చేశారు.(వెంటనే దిల్ రాజు అందుకుని మా జిల్లాల తీసుకోవద్దా? అందుకే అక్కడ తీశాం). ఈ సినిమా అయినా వరంగల్ లో తీసినందుకు థాంక్స్. ఏ సినిమా అయినా ఇక నుండి దిల్ రాజు వరంగల్ నుండే మొదలు పెట్టాలని మనస్పూర్తిగా కోరుతున్నాను' అన్నారు.

  English summary
  Actor Nani's upcoming film MCA Movie Pre Release Event held at Warangal. Nani, Sai Pallavi, Venu Sreeram, Dil Raju, Devi Sri Prasad, Priyadarshi Pullikonda, Srimani, Chandrabose, Balaji, Vijay Varma, Sravana Bhargavi, MLA Vinay Bhaskar, Jhansi, Pasunuri Dayakar, Aroori Ramesh, Yerrabelli Dayakararao at the event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X