»   » 'బాహుబలి-2' ని డైరక్ట్ చేసిన హీరో నాని

'బాహుబలి-2' ని డైరక్ట్ చేసిన హీరో నాని

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఏంటి..హీరో నాని..బాహుబలి 2 ని డైరక్ట్ చేయటం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా. విషయం నిజమే కానీ డైరక్ట్ చేసింది ఓ షాట్ మాత్రమే. అదెలా జరిగింది అంటే.. 'జెంటిల్‌మన్' హిట్ కొట్టిన నాని తన తదుపరి చిత్రం షూటింగ్ నిమిత్తం రామోజీ ఫిల్మ్ సిటీకి వెల్లారు. అక్కడకు దగ్గరలో రాజమౌళి డైరక్ట్ చేస్తున్న బాహుబలి చిత్రం షూటింగ్ జరుగుతోంది.

దాంతో తనకు ఈగ సమయంలో రాజమౌళి, ఆ టీమ్ తో ఏర్పడిన అనుబంధంతో సెట్స్ మీదకు వెళ్లాడు. దాంతో అక్కడ టీమ్ అంతా నానిని జెంటిల్ మేన్ చిత్రం హిట్ కొట్టినందుకు కంగ్రాట్స్ చెప్పారు. ఆ తర్వాత సరదాగా మాట్లాడుకున్న తర్వాత కొద్ది నిముషాలు పాటు బాహుబలి 2 టీమ్ కు కెప్టెన్ అయ్యారు. సన్నివేశంలో ఓ షాట్ ని డైరక్ట్ చేసారు. ఆ విషయాన్ని బాహుబలి టీమ్ ఫొటో తీసి స్నాప్ ఛాట్ ద్వారా అభిమానులకు షేర్ చేసారు.

nani

మీకు తెలుసా..నాని తన కెరీర్ ని మొదలు పెట్టింది డైరక్టర్ అవుదామనే. బాపు గారి దగ్గర రాధాగోపాలం చిత్రానికి అసెస్టెంట్ డైరక్టర్ గా పనిచేసారు. అలాగే ఇప్పుడు విరించి వర్మ డైరక్షన్ లో చేస్తున్న సినిమాలోనూ నాని పాత్ర..అసెస్టెంట్ డైరక్టర్ అని వినికిడి.

ఇక విరించి వర్మ దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీలో ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి అతిథి పాత్రలో కనిపించనున్నారట. ఆయన దగ్గర అసెస్టెంట్ గా పనిచేసే ఓ కుర్రాడు లవ్ స్టోరి అని చెప్తున్నారు. విరించి వర్మ దర్శకత్వంలో వచ్చిన ఉయ్యాలా జంపాలా మంచి హిట్ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే.

English summary
Nani took the opportunity to be 'Captain Of The Ship' for Baahubali 2 few minutes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu