ఒక దర్శకుడికి నాని ఝలక్ మరో డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్!
నాని నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమా ఇటీవల విడుదలై ఆశించిన స్థాయిలో విజయం సాధించలేక పోయింది. ఈ సినిమా తరువాత నాని నటిస్తోన్న సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. నాగార్జున నటిస్తోన్న ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అస్వినిదత్ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు.
ఈ సినిమా తరువాత నాని చెయ్యబోయే సినిమకు సంభందించి రకరకాల వార్తలు వస్తున్నా వాటిలో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. నాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో కిశోర్ తిరుమలతో సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నారు, కాని ఆ సినిమా మొదలు కాలేదు. నాని స్థానంలో సాయి ధరమ్ తేజ్ వచ్చినట్లు తెలుసొంది.

కిశోర్ తిరుమల స్థానంలో విక్రమ్ కుమార్ వచ్చినట్లు తెలుస్తోంది. హలో సినిమా తరువాత విక్రం కుమార్ నానిని డైరెక్ట్ చెయ్యబోతున్నాడు. మైత్రి మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. కిశోర్ తిరుమల స్థానంలో విక్రం కుమార్ రావడం విశేషం. త్వరలో ఈ సినిమా ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











