»   » 'జై బాలయ్య' అంటూ జనవరి 1 న

'జై బాలయ్య' అంటూ జనవరి 1 న

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : జై బాలయ్య అంటూ జనవరి ఒకటవ తేదిన మారు మ్రోగిపోనుంది. ఆ రోజున బాలకృష్ణ కు సంభందించిన ఏదన్నా ఈవెంటా అంటే ...కొంచెం అటూ ఇటూలో అలాంటిదే అయితే...బాలకృష్ణకు సంభంధం లేదు. జై బాలయ్య అనేది నాని కొత్త సినిమా టైటిల్ . ఈ టైటిల్ ని ఆ రోజు అఫిషియల్ గా ఎనౌన్స్ చేయ్యబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమా పాటలు జనవరి 10న, సినిమా ఫిబ్రవరి 5న విడుదల చెయ్యాడానికి సిద్దపడుతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.

గతంలో మన హీరోలు ఎన్టీఆర్, చిరంజీవి, రజినీకాంత్ లాంటి హీరోల అభిమానులుగా నటించడం చూశాం. కానీ బాలయ్య అభిమానిగా చాల రేర్. మరి బాలయ్య అభిమానిగా నాని ఏం చేస్తాడా.. బాలయ్య డైలాగులేమైనా పేలుస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది.

Nani-Hanu Raghavapudi reveals release plans

బాలయ్య ఫ్యాన్స్ కూడా ఈ క్యారెక్టర్ ను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. బాలయ్యతో ‘లెజెండ్' లాంటి బ్లాక్బస్టర్ తీసిన 14 రీల్స్ వాళ్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆ మధ్యన ‘సైజ్ జీరో' మూవీ ప్రీమియర్ షోకు హాజరైన నాని తన చేతిపై ‘జై బాలయ్య' టాటూతో కనిపించారు.

నాని హీరోగా రూపోందుతున్న ఈ సినిమాకి హను రాఘవపూడి డైరక్టర్. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట,మరియు అనిల్ సుంకరలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత నాని ...చంద్రశేఖర్ యెలిటి, ఇంద్రగంటి మెహన్ కృష్ణ సినిమాలలో నటిస్తారని సమాచారం.

English summary
Nani's upcoming movie with Hanu Raghavapudi tentatively titled Jai Balayya first look on Jan 1 and also reveal the film title officially.
Please Wait while comments are loading...