»   » మా ఆవిడ లైవ్ చూస్తోందక్కడ.... ఫేస్ బుక్ ఆఫీస్ లో నానీ

మా ఆవిడ లైవ్ చూస్తోందక్కడ.... ఫేస్ బుక్ ఆఫీస్ లో నానీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈమధ్య టాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్‌కు హైదరాబాద్‌లోని ఫేస్‌బుక్ ఆఫీస్ కొత్త వేదికగా మారింది. ప్రతీ సినిమా కీ నటీనటులూ టెక్నీషియన్స్ అక్కడుకి వెళ్ళి ఫేస్ బుక్ ఉధ్యోగులతో చిట్ చాట్ చేయటం ఒక ఆనవాయితీ అయిపోయింది 'నేను లోకల్' టీమ్ ప్రమోషన్ కోసం నాని కీర్తీ సురేష్ ఫేస్‌బుక్ ఆఫీస్‌కు వెళ్లారు. అక్కడ వీళ్ళిద్దరినీ ఫేస్‌బుక్ ఉద్యోగులు పలు ప్రశ్నలు అడిగారు.

Nani and Keerthy Suresh Chit Chat at Facebook Office

అయితేఝాన్సీ అనే ఉద్యోగి మొదటగా ప్రశ్నించే అవకాశాన్ని దక్కించుకుని కీర్తిసురేష్‌కు ఓ చిలిపి ప్రశ్న సంధించింది. ''కీర్తిగారు మిమ్మల్నిచూసి హీరోలతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా క్రేజీ.. క్రేజీ ఫీలింగ్ అని పాడుతారు. అలా మీకు ఎవరిమీదైనా క్రేజీ ఫీలింగ్ ఉందా?'' అని డిగేసింది.. ''ఇప్పటికైతే నాని.. ఎందుకంటే ఇప్పుడు తనే నా ముందున్నాడు'' అంటూ పక్కనున్న నాని ని చూపించింది.


Nani and Keerthy Suresh Chit Chat at Facebook Office

అయితే అప్పుడే "అదేంటీ మీ మొహం లో ఏ ఎక్స్ప్రెషనూ లేదేంటీ??" అంటూ పక్కనే ఉన్న మరో హోస్ట్ ప్రశ్నించింది. దానికి నాని సమాధానమిస్తూ.. ''అంటే.. నాకు తెలిసి మా ఆవిడ లైవ్ చూస్తోంది. సో..! ఇప్పుడేదో ఓవర్‌గా రియాక్ట్ అయి, ఇంటికెళ్లాక దొరికిపోయి.. 'ఏంటి.. అంతిచ్చావేంటి ఎక్స్‌ప్రెషన్?' అంటే.. అందుకే ఈ కాంప్లికేషన్స్ అన్నీ ఎందుకని అవాయిడ్ చేస్తున్నా.. చాలా న్యూట్రల్‌గా, పొలిటీషియన్‌గా'' అంటూ తనదైన న్యాచురల్ స్టయిల్ లో చెప్పుకొచ్చాడు.

English summary
Actors Nani and Keerthi Suresh visited Hydera bad Face book Office, and had a little chit chat with Facebook Team
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu