»   » టీజర్ టాక్ : రామాయణంలో కృష్ణంరాజు, ఎడిటర్ గౌతమ్ రాజు కూడా ఉంటారు..నాని లెక్క!

టీజర్ టాక్ : రామాయణంలో కృష్ణంరాజు, ఎడిటర్ గౌతమ్ రాజు కూడా ఉంటారు..నాని లెక్క!

Subscribe to Filmibeat Telugu
Krishnarjuna Yuddham Teaser 'కృష్ణార్జున యుద్ధం' టీజర్ : Nani, Anupama Parameswaran

వరుస విజయాలతో నాని దూసుకుపోతున్నాడు. గత ఏడు చిత్రాలుగా నానికి పరాజయమే లేదు. కాస్త యావరేజ్ అనిపించిన చిత్రాలు కూడా నాని క్రేజ్ తో కమర్షియల్ గా విజయం సాధిస్తున్నాయి. నానితో సినిమా అంటే నిర్మాత గుండెల మీద చేయివేసుకుని దైర్యంగా పడుకోవచ్చు అనేంతగా లాభాల పంట పడుతోంది. ఎంసీఏ చిత్రం తరువాత నాని నటిస్తున్న చిత్రం 'కృష్ణార్జున యుద్ధం'. ఈ చిత్రంలో నాని డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నాడు. తాజాగా విడువులైన ఈ చిత్ర టీజర్ ఆసక్తికరంగా ఉంది. నాని మార్క్ హాస్యం నవ్వుల పువ్వులు పూయిస్తోంది.

 వరుస హిట్లతో సక్సెస్ ఫుల్ హీరోగా

వరుస హిట్లతో సక్సెస్ ఫుల్ హీరోగా

గత ఏడు చిత్రాలుగా నానికి పరాజయమే లేదు. భలే భలే మగాడివోయ్ చిత్రంతో మొదలైన నాని జైత్ర యాత్ర ఇటీవ ఎంసీఏ చిత్రం వరకు కొనసాగింది. నాని చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద మినిమమ్ గ్యారెంటీ చిత్రాలుగా మారిపోయాయి.

యావరేజ్ చిత్రాలు కూడా

యావరేజ్ చిత్రాలు కూడా

ఇటీవల నాని చిత్రాలు కొన్నింటికి యావరేజ్ టాక్ కూడా వచ్చింది. కానీ కేవలం నాని క్రేజ్ తో ఆ చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇటీవల విడువులైన ఎంసీఏ చిత్రం టాక్ పరంగా యావరేజ్ చిత్రంగా నిలిచినా వసూళ్ల పరంగా మంచి విజయం సాధించింది.


 ద్విపాత్రాభియనంలో మెప్పించడానికి

ద్విపాత్రాభియనంలో మెప్పించడానికి

వరుస విజయాలు జోరుతో మరో మరు నాని మెప్పించడానికి రాబోతున్నాడు. నాని నటిస్తున్న తాజా చిత్రం కృష్ణార్జున యుద్ధం. ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు.


టీజర్ విడుదల

తాజా ఈ చిత్ర టీజర్ విడుదలయింది. టీజర్లో నాని మార్క్ హాస్యం, డైలాగులు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. టీజర్ చివర్లో వచ్చే సన్నివేశం అయితే నవ్వుల పువ్వులు పూయిస్తోంది.


 రామాయణంలో కృష్ణంరాజ, ఎడిటర్ గౌతమ్ రాజు

రామాయణంలో కృష్ణంరాజ, ఎడిటర్ గౌతమ్ రాజు

రామాయణం అంతా విని ధర్మరాజు ఎవరు అని అడిగిందట నీలాంటి సోంబేరి ముఖం అని నాని డైలాగ్ చెబుతాడు. పక్కనే ఉన్న వ్యక్తి రామాయణంలో ధర్మరాజు ఎక్కడుంటాడు అని అడుగుతాడు. నాని అతడి చెంప పగలగొడుతాడు. వెంటనే అతడి ఒపీనియన్ మారిపోతుంది. రామాయణంలో ధర్మరాజు ఏం ఖర్మ..కృష్ణంరాజు, ఎడిటర్ గౌతమ్ రాజు కూడా ఉంటారు అని అంటాడు. టీజర్ చూసాక చిత్రంలో ఇలాంటి వినోదానికి కొదవ లేదని అనిపిస్తుంది.


 ఇద్దరు భామలతో రొమాన్స్

ఇద్దరు భామలతో రొమాన్స్

నాని డ్యూయెల్ రోల్ కు తగ్గట్లుగా ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మీర్ నానితో రొమాన్స్ చేయబోతున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకుడు.


English summary
Nani movie Krishnarjuna Yuddham teaser released. Merlapaka Gandhi directing this movie. Anupama Parameswaran, Rukshar Mir are heroines
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu