నాని, నిత్యామీనన్ కలిసి'సెగ'పెడుతున్నారు
ఈ సంవత్సరం చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయం సాధించిన అలా మొదలైంది చిత్రం కాంబినేషన్ నాని,నిత్యా మీనన్ మరో సారి వెండితెరపై కనిపించి అలరించనున్నారు. ఈ చిత్రం పేరు సెగ. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని గౌతమ్ మీనన్ అశోశియేట్ అంజన తెరకెక్కిస్తోంది. తమిళంలో వెప్పం పేరుతో విడుదలయ్యే ఈ చిత్రం అదే రోజు తెలుగులోనూ రిలీజ్ అవుతుంది.మనదేశం బ్యానర్ పై అశోక్ వల్లభనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ విషయం మీడియాకు వివరిస్తూ నిర్మాత అశోక్...నందినీ రెడ్డి,ఈ చిత్రం దర్శకురాలు అంజన మంచి ప్రెండ్స్. నందినీలాగానే ఈ చిత్రంలోనూ అంజన మంచి నావెల్టీ పాయింట్ ని తీసుకుని తెరకెక్కించింది.సినిమా మొత్తం యువత ఆలోచనలు,వారి టెంపరమెంట్స్ ను చూపిస్తూ సాగుతుంది అన్నారు.అలాగే ఈ చిత్రంలో ఆవకాయ బిర్యాని భామ బిందు మాధవి ఓ కీలకమైన పాత్రను పోషించింది.ప్రేమిస్తే ఫేమ్ జాఝువా శ్రీధర్ సంగీతం అందించిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











