Just In
- 11 min ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరో కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 1 hr ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 2 hrs ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 10 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
Don't Miss!
- News
వెర్టికల్ ఛార్లీ స్పెషల్ అట్రాక్షన్: విన్యాసాల కోసం ఎదురు చూపులు: కాస్సేపట్లో నింగిలోకి
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Sports
ISL 2020 21: చెన్నయిన్ X ముంబై మ్యాచ్ డ్రా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నిర్మాతకు ‘పైసా’ మిగలదని తేల్చిన కృష్ణవంశీ
హైదరాబాద్ : నాని హీరోగా, కృష్ణ వంశీ దర్శకత్వంలో 'పైసా' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని పుప్పాల రమేష్ ఎల్లోఫ్లవర్స్ బేనర్‌పై నిర్మిస్తున్నారు. నాని సరసన కేథరీన్ నటిస్తుంది. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. దర్శకరత్న దాసరి నారాయణరావు ముఖ్యఅతిథిగా హాజరై సీడీలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ...తెలుగు సినిమాలు మూస పద్దతిలో వెలుతున్నాయి. దీన్ని మార్చాలంటే కృష్ణ వంశీ లాంటి దర్శకులు రావాలి. కృష్ణ వంశీ కమిట్ మెంటుతో సినిమాలు చేస్తాడు. అందులో వ్యాపార విలువలు కూడా ఉంటాయి. హీరోను, హీరోయిజాన్ని చూపించాలంటే కృష్ణ వంశీ లాంటి దమ్మున్న దర్శకులు కావాలి. అలాగే హీరోయిన్‌ను కూడా అందంగా చూపిస్తాడు. నాని ఇప్పటి వరకు ఎన్నో హిట్ సినిమాలు చేసాడు. కానీ ఈ సినిమా అతన్ని గొప్ప హీరోగా నిలబెతుంది. ఈ చిత్ర ఆడియో పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.
కృష్ణ వంశీ మాట్లాడుతూ....'పైసా' సినిమాను కసితో, ఎనర్జీతో, పాషన్‌తో తీసాను. నాని కూడా పాషన్‌తో, ఒక మంచి సినిమాలో భాగం కావాలని నటించాడు. సినిమా మొదటి నుంచి ఎన్నో సమస్యలు వచ్చాయి. సినిమా విడుదలైన తర్వాత నిర్మాత రమేష్ పుప్పాలకు ఏమీ మిగలదు. ఆ విషయం తెలిసి కూడా ఆయన ధైర్యంగా తీసారు' అని చెప్పుకొచ్చారు.
నాని మాట్లాడుతూ....ఈ సినిమా ఒక మంచి సినిమా అవుతుంది. జయపజయాలతో సంబంధం లేదు. కృష్ణ వంశీతో పని చేయడం వల్ల ఎంతో నేర్చుకున్నాను. సాయి కార్తీక్ అర్థం చేసుకుని ఈ సినిమాకు సంగీతం అందించారు అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి నవదీప్, సునీల్, మైఖేల్ మదన కామరాజు, అల్లరి నరేష్, తనీష్, తరుణ్, సుధీర్ బాబు, శర్వానంద్, శ్రీకాంత్, ఆది, వరుణ్ సందేష్, సందీప్ కిషన్ తదితరులు హారయ్యారు.
ఆడియో విడుదల కార్యక్రమ చిత్ర మాలిక స్లైడ్ షోలో...

ఆడియో వేడుకలో దాసరి

ఆడియో విడుదల చేస్తున్న దృశ్యం

పైసా ఆడియో వేడుకలో పాల్గొన్న యువ హీరోలు

సునీల్, అల్లరి నరేష్, తనీష్‌లతో నాని

ఆడియో వేడుకలో యువ హీరోల సందడి