For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డబ్బు వల్లే ఈ సమస్యలన్నీ : కృష్ణ వంశీ

  By Bojja Kumar
  |
  Nani
  హైదరాబాద్ : క్రియేటివ్ థాట్స్‌తో సినిమాలను రూపొందిస్తూ తనకంటూ సపరేట్ బ్రాండ్ ఇమేజ్ ఏర్పాటు చేసుకున్న దర్శకుడు కృష్ణ వంశీ, యంగ్ హీరో నాని, ఎల్లోఫ్లవర్స్ బేనర్ అధినేత పుప్పాల రమేష్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'పైసా'. షూటింగ్ పూర్తయి పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. మే 19న ఆడియో విడుదల చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు.

  ఈ సందర్భంగా సినిమా గురించి దర్శకుడు కృష్ణ వంశీ మాట్లాడుతూ...'డబ్బు వల్ల మానవ సంబంధాలు బాగా దెబ్బతింటున్నాయి. గత ఐదు సంవత్సరాలుగా డబ్బు విలువ ఎంతో పెరిగిపోతుంది. డబ్బు చుట్టూ ప్రపంచం, భూమి తిరుగుతోంది. అంతా డబ్బులో కొట్టుకుపోతున్నాం అనిపించింది. అలాంటి ఒక ఐడియా మీద సినిమా తీద్దామా అనుకుని స్ర్కిప్టు రెడీ చేసాను. ఆ స్క్రిప్టుకి పర్ ఫెక్ట్‌గా నాని అయితేనే బాగుంటుందని అతని అప్రోచ్ అయి సినిమా తీసాం. ఇది ఎలాంటి సినిమా అనేది నేనే చెప్పేకంటే ప్రేక్షకులే చూసి చెబితే బాగుటుంది. ఒక్కటి మాత్రం కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. ఇది వెరీ వెరీ ట్రెండీ ఫిలిం. 'పైసా' మా అందరికీ చాలా మంచి పేరు తెస్తుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం' అన్నారు.

  నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ...'ఒక తపన, ఒక ధ్యేయంతో పైసా చిత్రాన్ని గొప్పగా తీయాలని స్టార్ట్ చేసాం. కృష్ణ వంశీ ఈ చిత్రాన్ని తీసిన విధానం, ఆయన తీసిన సన్నివేశాలు చూసాక సినిమా చాలా అద్భుతంగా అనిపించింది. మేం ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా దుబాయ్, మలేషియాలలో భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించాం. డెఫినెట్‌గా మా 'పైసా' చిత్రం పెద్ద హిట్టయి గొప్ప రికార్డులు సృష్టిస్తుంది. ఈ చిత్రానికి సాయి కార్తీక్ అందించిన సంగీతం ఎక్సలెంట్. ఈ నెల 19న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ శిల్పకళా వేదికలో చాలా గ్రాండ్‌గా జరుపబోతున్నాం. అతి త్వరలోనే చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.

  హీరో నాని మాట్లాడుతూ...'ఈ చిత్రంలోని ప్రతి సీన్ ఎంతో ఎంజాయ్ చేసాను. వంశీగారు ఫలానా లొకేషన్స్‌లో చేయాలి అంటే అది ఎంత రిస్క్ అయినా చేయాల్సిందే. అది ఆయన వర్కింగ్ స్టైల్. ఇలాంటి ఒక మంచి చిత్రానికి రమేష్ గారు మాకు సపోర్టుగా ఉండి ఎక్కడా కంప్రమైజ్ అవకుండా సినిమా తీసారు. ఒక భారత పౌరుడిగా తన చిత్రాల ద్వారా ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అంటారు కృష్ణ వంశీ. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్టయి అందరికీ పేరు తెస్తుందని నమ్ముతున్నాను' అన్నారు.

  ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సంతోష్ కుమార్ రాయ్, సంగీతం : సాయి కార్తీక్, ఎడిటర్ : త్యాగరాజన్, ఆర్ట్ : బ్రహ్మకడలి, ఫైట్ మాస్టర్ : సాల్మన్ రాజు, ప్రకాష్, వెంకట్, పాటలు : సిరివెన్నెల సీతారామశాస్త్రి, అనంత్ శ్రీరామ్, రచయితలు : కెకె. బినోశ్రీ, శ్రీనివాసరెడ్డి, పాత్రికేయ, కొరయోగ్రఫీ : రఘు, శ్రీధర్, మేకప్ : నాగు, కాస్ట్యూమ్స్ : రమేష్, డైరెక్షన్ టీం : గిరి, శ్రీనివాస్ పుప్పాల, గోపి, శ్రీకాంత్, రాజు, లింగఖాన్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ : శ్రీనివాస్ రాజు, జివివి విజయ్ కుమార్, ఎస్. రవికుమార్, ముజీబ్, ప్రొడక్షన్ కంట్రోలర్స్ : ఎల్. కిషోర్, కె. బాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రాజా రవీందర్, నిర్మాత : రమేష్ పుప్పాల, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : కృష్ణ వంశీ.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X