»   » అదే థియేటర్ ముందు నిలబడే వాన్ని... ఆకట్టుకున్న నాని పోస్ట్

అదే థియేటర్ ముందు నిలబడే వాన్ని... ఆకట్టుకున్న నాని పోస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాని ఫుల్ పామ్ లో ఉన్నాడు. ఓ ప్రక్కన దేవి మంచి హిట్ పాటలు ఇచ్చేసాడు. డైరక్టర్ చూస్తే..ఇంతకు ముందు పెద్ద హిట్ ఇచ్చి ఉన్నాడు. దిల్ రాజు అయితే చిన్న సినిమాలతో పెద్ద హిట్ కొట్టడంలో ఆరితేరిపోయాడు. నిర్మాత‌గా వ‌రుస విజ‌యాల‌ను సాధిస్తున్న దిల్‌రాజు, సినిమా చూపిస్త మావతో స‌క్సెస్ సాధించిన త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వం..ఇలా అంద‌రూ స‌క్సెస్ ఫుల్ వ్య‌క్తులు కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమాయే నేను లోక‌ల్‌. నాని, దిల్‌రాజు కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తొలి సినిమా కావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలే నెల‌కొన్నాయి.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నాని నటన నచ్చని సినిమా అభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదు. అందరి హీరోల అభిమానులూ నాని సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. శుక్రవారం నాని హీరోగా నటించిన 'నేను లోకల్‌' సినిమా విడుదలవుతోంది. హైదరాబాద్‌లోని సుదర్శన్‌ థియేటర్‌లో ఆ సినిమా ప్రదర్శితమవుతోంది.


Nani posted in face book when he is a common man

దాంతో ఆ థియేటర్‌ ముందు దాంతో ఆ థియేటర్‌ ముందు నానిది ఓ భారీ కటౌట్‌ ఏర్పాటు చేశారు అభిమానులు. . ఈ సందర్భంగా తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు నాని. 'ఇప్పుడు నా భారీ కటౌట్‌ ఉన్న చోటే చిన్నప్పుడు చాలా సినిమాల టిక్కెట్ల కోసం నిలబడేవాడిని. ఇప్పుడు జీవితం నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. మీ అభిమానం లేకపోతే నేను లేను. మీ రుణం తీర్చుకుంటాను.. ఇది నిజం' అని నాని తన ఫేస్‌బుక్‌ పేజీలో కామెంట్‌ రాసి ఈ ఫోటోను పోస్ట్‌ చేశాడు.


"నేను లోకల్" మూవీ నేడు థియేటర్స్ ని హిట్ చేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా నేను లోక‌ల్ రూ 19.70 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా ఓవ‌ర్సీస్ థియేట్రిక‌ల్ రైట్స్ రూ.3 కోట్ల‌కు అమ్ముడ‌య్యాయి. నాని రెండు సినిమాలు ఓవ‌ర్సీస్‌లో మిలియ‌న్ మార్క్ ట‌చ్ చేయ‌డంతో ఈ సినిమాకు అక్క‌డ కూడా మంచి బిజినెస్ జ‌రిగింది.

English summary
"As a kid I stood right where my feet are for many films.. Now life brings me to this..without YOU I'm nothing! Will make this count.. Promise!" Tollywood Hero Nani posted on his Facebook wall
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu