కొత్త కామెడీ ('భలే భలే మగాడివోయ్' ప్రివ్యూ, స్టోరీ లైన్)
హైదరాబాద్: సాధారణంగా మారుతి చిత్రాలు బూతుతో నిండి ఉంటాయని అందరూ ఫిక్స్ అయి ఉంటారు. అయితే ఆయన ఆ ఇమేజ్ ని మార్చుకోవటానికి ఇంతకు ముందు అల్లు శిరీష్ తో కొత్త జంట చిత్రం రూపొందించారు. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాకపోయినా అల్లు అరవింద్ వంటి నిర్మాతతో మరో చిత్రం నిర్మించేలా చేయగలిగింది. అలా వచ్చిందే ఈ చిత్రం.
స్టోరీ లైన్
లక్కీ అనే మతిమరుపు యువకుడి కథ ఇది. అతని పాత్ర ఎలాంటిదంటే ఒకరిని హాస్పటిల్ లో జాయిన్ చేయటానికి బయిలు దేరి మధ్యలో ఇంకో ఫ్రెండ్ కలిస్తే...అతను ఓ సినిమా గురించి చెప్తే...అది విని... హాస్పటిల్ విషయం మర్చిపోయి సినిమాకు బయిలు దేరతాడు. అలా మతిమరుపు సమస్యతో జీవితాన్ని కొనసాగించే అతనికి ఓ ప్రేమకథ ఉంటుంది. ఆ క్రమంలో చోటుచేసుకునే సంఘటనలేమిటి? మతిమరుపు సమస్యను అధిగమించి అతను తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడన్నదే ఆసక్తికరంగా వుంటుంది.
అలాగే ఇందులో నాని పాత్ర చేసే చేష్టలు చూసి 'భలేంటోడే..' అనుకొంటారంతా. దానికి తోడు ఈ సినిమాలో నాని ఫోన్ రింగ్ టోన్‌గా వచ్చే పాట అది. ఆ పాట నాని సెల్‌లో మోగినప్పుడల్లా థియేటర్లో నవ్వులే నవ్వులు వస్తాయి. ఈ సినిమా చూశాక.. కథకి ఈ పేరే సెట్ అవుతుంది అనిపిస్తుంది.

నాని మాట్లాడుతూ... 'ఈ రోజుల్లో'కు ముందు మారుతి అంటే ఎవరికీ తెలీదు. చేతిలో రూ. నలభై లక్షలు, ఓ 5డీ కెమెరా పట్టుకొని ఏం చేయగలరు? ముందు తనకంటూ ఓ గుర్తుంపు తెచ్చుకోవాలి. ఏదో మ్యాజిక్ చేయాలి. అందుకోసం ఆ తరహా కథ ఎంచుకొన్నారేమో. అయితే నిజమైన మారుతి వేరు. ఆయన ఆలోచనలు వేరు. నా రెండో సినిమాగా 'ఎవడే సుబ్రహ్మణ్యం' వస్తే ఒప్పుకొనేవాణ్ని కాదేమో. ఆ సినిమా ఫ్లాపయితే నా పరిస్థితి ఏంటి? అని ఆలోచించి.. వదులుకొనేవాణ్ని. మారుతి కూడా అదే చేశారు. నిలదొక్కుకొన్నాక తనదైన ముద్ర చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. 'భలే భలే..'తో ఆయనలోని దర్శకుడు మరో కోణంలో కనిపిస్తాడు అన్నారు.
భాక్సాఫీస్ వద్ద నాని చిత్రాలు సైతం ఈ మధ్య కాలంలో ఏదీ పెద్దగా వర్కవుట్ కాలేదు. దాంతో నాని సైతం ఈ చిత్రం పై చాలా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఈ చిత్రం ట్రైలర్స్ ఇప్పటికే ఆసక్తిని రేపటంతో ఓపినింగ్స్ సైతం బాగుంటాయని భావిస్తున్నారు. ఇండస్ట్రీలోనూ,బయిటా ఈ చిత్రంపై పాజిటివ్ టాక్ ఉంది. ఈ చిత్రం డైలాగ్ టీజర్ ని ఇక్కడ చూడండి.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
'ఈ రోజుల్లో', 'బస్టాప్'తో అడాల్ట్ మూవీస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మారుతీ 'కొత్త జంట'తో ఆ ఇమేజ్ ను మార్చుకునే ప్రయత్నం చేశాడు కానీ, పెద్దంత సక్సెస్ కాలేదు. ఈసారి మాత్రం అందుకోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నాడని తెలుస్తోంది.
బ్యానర్:గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్
నటీటులు:నాని, లావణ్య త్రిపాఠి, మురళిశర్మ, సితార, నరేష్, స్వప్నమాధురి, శ్రీనివాసరెడ్డి, వెన్నెలకిశోర్, ప్రవీణ్, షకలక శంకర్ తదితరులు
ఎడిటింగ్: ఉద్ధవ్, కెమెరా: నిజార్ షఫీ,
సంగీతం: గోపీ సుందర్,
నిర్మాత: బన్నీవాసు,
సమర్పణ: అల్లు అరవింద్
రచన, దర్శకత్వం: మారుతి.
విడుదల తేదీ: 05,సెప్టెంబర్ 2015.


Click it and Unblock the Notifications











