»   » "జెంటిల్‌మేన్" టీజర్ & ఆడియో విడుదల తేదీలు

"జెంటిల్‌మేన్" టీజర్ & ఆడియో విడుదల తేదీలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

వరుస హిట్స్ తో ఊపు మీదున్న నేచురల్ స్టార్ "నాని" ఈ మధ్య మానసిక సమస్యలు ఉండే పాత్రలనే వరుసగా ఎంచుకుంటున్నాడు. "భ‌లే భ‌లే మ‌గాడివోయ్" సినిమాలో అత‌డిది మ‌తిమ‌ర‌పు స‌మ‌స్యైతే, "కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాథ‌" లో పిరికిత‌నం సమ‌స్య‌. ఈ రెండూ జ‌నాన్ని బాగా ఎంట‌ర్ టైన్ చేసాయి. కాగా ఇప్పుడు నాని క‌థానాయ‌కుడిగా ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ డైరెక్ష‌న్ లో వ‌స్తున్న "జెంటిల్ మ‌న్" లో నాని ప్ర‌ధాన స‌మ‌స్య క‌న్ఫ్యూజ‌న్.

తను హీరోనా? విల‌నా? అనే క‌న్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉంటాడ‌ట క‌థానాయ‌కుడు. పైకి జెంటిల్ మేన్ గా క‌నిపిస్తున్నాడు కానీ లోప‌ల మాత్రం పెద్ద క‌న్ఫ్యూజ‌న్ మాస్ట‌ర్ నాని. 'జెంటిల్ మ‌న్' చిత్రం మ‌ర్డ‌ర్ మిస్ట‌ర్ ఆధారంగా తెర‌కెక్కుతోంది.


చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం డ‌బ్బింగ్ జ‌రుగుతోంది. ఆ పనులు కూడా తుదిద‌శ‌కు చేరుకున్నాయి. ఈ నెల 12న తొలి టీజ‌ర్‌ను, 22న పాట‌ల‌ను విడుద‌ల చేస్తారట.మ‌ణిశ‌ర్మ ఇచ్చిన ట్యూన్లు అద్భుత‌ంగా ఉన్నాయంటున్నారు. టైటిల్ థీమ్ సాంగ్ దుమ్మురేపుతుందంటున్నారు.


Nani's Gentleman Movie Audio Launch Date Locked

"అంద‌మైన రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కించాం. అన్ని ర‌కాల భావోద్వేగాలున్న చిత్రమిది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌కు అనూహ్యమైన స్పంద‌న వ‌స్తోంది. హీరోనా, విల‌నా..? అన్న క్యాప్షన్ స‌ర్వత్రా ఆస‌క్తిని రేకెత్తించింది" అని అన్నారు నిర్మాత‌ శివలెంక కృష్ణ ప్రసాద్


అవసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి, 'వెన్నెల' కిశోర్, ఆనంద్, రోహిణి, 'సత్యం' రాజేశ్, రమాప్రభ, ప్రగతి, రాజశ్రీ నాయర్, శ్రీముఖి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: డేవిడ్ నాథన్, సంగీతం: మణిశర్మ, కెమేరా: పి.జి. విందా, ఆర్ట్: ఎస్.రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్, కో-డైరెక్టర్: కోట సురేశ్ కుమార్, స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

English summary
Nani Gentleman Movie Audio launch on May 22nd
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu