»   » నాని న్యూ మూవీ ‘కృష్ణగాడి వీర‌ ప్రేమగాథ’ (ఫస్ట్ లుక్)

నాని న్యూ మూవీ ‘కృష్ణగాడి వీర‌ ప్రేమగాథ’ (ఫస్ట్ లుక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాని హీరోగా అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడి డైరక్షన్ ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స బేనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ' అనే టైటిల్ ఖరారు చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు.

నాని ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ అభిమానిగా కనిపిస్తాడట. గతంలో ఈ సినిమాకు ‘జై బాలయ్య' అనే టైటిల్‌ వినిపించింది. అయితే ఈ టైటిల్ ఒక వర్గానికి చెందినదిగా ఉండటంతో 'కిృష్ణా గాడి వీర ప్రేమ గాథ' గా మార్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

Nani's Krishna Gadi Veera Prema Gadha Firstlook

త్వరలోనే ఆడియో విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమాకు గానూ...నాని తన రెమ్యూనరేషన్ 4 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు చెప్పుకంటున్నారు సమాచారం. నిజమైతే...ఇదే ప్రస్తుతానికి నాని కెరీర్ లో ది బెస్ట్ రెమ్యూనరేషన్ అవుతుంది . ఈ సినిమా రోమాంటిక్ ఎంటర్ ట్రైనర్ గా రూపోందుతోంది.

14 రీల్స్ పతాకంపై రూపొందుతోందుతున్న ఈ సినిమాకు అనిల్ సుంకర్ నిర్మాత. అనంతపుతం బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథ ఇది. ఈ సినిమాను ఫిబ్రవరి 5న విడుదల చేయాడానికి సిద్దం అవుతున్నారు. నాని నటించిన ‘భలే భలే మగాడివోయ్' చిత్రం మంచి విజయం సాధించిన నేపథ్యంలో ఆ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

English summary
Hero Nani is getting ready with his next. Directed by Hanu Raghavapudi of Andala Rakshasi fame, the team would be confirming the title of the movie as Krishna Gadi Veera Prema Gadha.
Please Wait while comments are loading...