»   »  సింగిల్ కట్ కూడా లేదు: నాని ‘కృష్ణార్జున యుద్ధం’ సెన్సార్ రిపోర్ట్

సింగిల్ కట్ కూడా లేదు: నాని ‘కృష్ణార్జున యుద్ధం’ సెన్సార్ రిపోర్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'కృష్ణార్జున యుద్ధం'. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు సభ్యులు సింగిల్ కట్ కూడా లేకుండా యు/ఎ సర్టిఫికెట్ జారీ చేశారు.

ఇందులో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కృష్ణ అనే చిత్తూరు కుర్రాడి పాత్రలో మాస్ యాటిట్యూడ్‌తో, అర్జున అనే రాక్ స్టార్ పాత్రలో క్లాస్ యాటిట్యూడ్‌తో ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతున్నాడు. నాని సరసన అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ హీరోయిన్లు.

Nani’s Krishnarjuna Yuddham Censor report

రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. యుద్ధం వస్తే యుద్ధం చేయాలే కానీ పద్యం పాడకూడదురా... అంటూ కృష్ణ చెప్పే డైలాగులు, సిన్సియర్ గా ఒక అమ్మాయిని లవ్ చేయడం, ఇటాలియన్ మాఫియాతో పెట్టుకోవడం రెండూ ఒకటే అంటూ అర్జున్ చెప్పే డైలాగులు అభిమానులు ఆకట్టుకుంటున్నాయి.

వరుస విజయాలతో జోరుమీదున్న నాని.... ఈ చిత్రంతో మరో హిట్ కొడతాడనే నమ్మకం అందిరిలోనూ ఉంది. వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి స‌మ‌ర్ప‌ణ‌లో షైన్ స్క్రీన్స్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 12న సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
Natural Star Nani’s ‘Krishnarjuna Yuddham’ has completed the censor formailities and received ‘U/A’ certificate from the members of regional censor board. The censor board did not suggest a single cut.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X