twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వరుసగా 8 హిట్లు కొట్టిన నాని.... 9వ చిత్రం కూడా సిద్దమైంది, రిలీజ్ ఎప్పుడేంటే?

    By Bojja Kumar
    |

    Recommended Video

    నాని సక్సెస్ హవా.. వరుసగా 8 హిట్లు..

    తెలుగులో ఈ మధ్య కాలంలో మంచి సక్సెస్ రేటుతో మినిమమ్ గ్యారంటీ హీరోగా దూసుకెలుతున్నది ఎవరు అంటే అందరి నోటా ఒకేటే మాట వినిపిస్తుంది. అతడు మరెవరో కాదు నేచురల్ స్టార్ నాని. ఒకటి కాదు రెండు కాదు... నాని వరుసగా 8 విజయాలు అందుకున్నాడు. త్వరలో 9వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి త్రిబుల్ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు.

     ఎవడేతో... మొదలై వరుసగా

    ఎవడేతో... మొదలై వరుసగా

    ‘ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాతో మొదలైన నాని విజయాలు అందుకున్నారు. భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాధ, జెంటిల్మెన్, మజ్ను, నేను లోకల్, నిన్నుకోరి, ఇటీవల విడుదలైన ‘ఎంసీఏ' వరకు నాని విజయపరంపర కొనసాగుతూనే ఉంది.

    వరుస విజయాలు, భారీ సంపాదన, సొంతగా నిర్మాణ రంగంలోకి

    వరుస విజయాలు, భారీ సంపాదన, సొంతగా నిర్మాణ రంగంలోకి

    వరుస విజయాలు అందుకున్న హీరో నాని నిర్మాతకు మినిమమ్ గ్యారంటీ హీరోగా మారిపోయాడు. వరుస విజయాలతో వచ్చిన డబ్బుతో నాని సినీ నిర్మాణరంగంలోకి అడుగు పెట్టారు. వాల్ పోస్ట‌ర్ అనే ప్రొడ‌క్ష‌న్ సంస్థ స్థాపించి, ఇందులో నూతన దర్శకుడు ప్రశాంత్ వర్మతో కలిసి తొలి సినిమా స్టార్ట్ చేసాడు. ‘అ' అనే పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

    విడుదలకు సిద్ధమైన నాని 9వ సినిమా

    విడుదలకు సిద్ధమైన నాని 9వ సినిమా

    త్వరలో నాని తన 9వ సినిమా ‘కృష్ణార్జున యుద్ధం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఫ్రేం మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ మీర్ హీరోయిన్లు.

     షూటింగ్ ఎక్కడి వరకు?

    షూటింగ్ ఎక్కడి వరకు?

    వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి స‌మ‌ర్ప‌ణ‌లో షైన్ స్క్రీన్న్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఫైన‌ల్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఇందులో కీల‌క‌మైన స‌న్నివేశాలను చిత్రీక‌రిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది.

    రిలీజ్ డేట్ ఖరారు

    రిలీజ్ డేట్ ఖరారు

    అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 12న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి హిప్ హాప్ త‌మిళ సంగీతాన్ని అందిస్తుండ‌గా, కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

    English summary
    Krishnarjuna Yuddham is the latest movie of Natural Star Nani who accomplished eight consecutive hits starting from ‘Yevade Subrahmanyam’ to recently released ‘MCA’. Nani will be seen in dual roles in Krishnarjuna Yuddham is produced jointly by Sahu Garapati and Harish Peddi under Shine Screens Banner, 'Venkatadri Express' and 'Express Raja' fame director Merlapaka Gandhi is directing the film. The movie will hit the screens on April 12, 2018.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X