»   » నీకు అర్థం అవుతోందా… నా గెలుపు ఆల్రెడీ మొద‌లైపోయింది: నిన్ను కోరి ట్రైలర్

నీకు అర్థం అవుతోందా… నా గెలుపు ఆల్రెడీ మొద‌లైపోయింది: నిన్ను కోరి ట్రైలర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు నాని. త‌న మార్కెట్ రోజు రోజుకీ పెంచుకొంటూ వెళ్తున్నాడు. ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్‌, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్‌మేన్‌, మజ్ను, నేను లోకల్‌ వంటి వరస హిట్స్‌తో ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకుంటున్న నాని తాజాగా 'నిన్నుకోరి' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

నిన్ను కోరి

నిన్ను కోరి

డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి పతాకంపై శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. ప్రేక్షకుల్లో నాని క్రేజ్ కూడా పెరిగిపోయింది.. దాంతో మార్కెట్ ను కూడా పెంచేసుకుంటున్నాడు.. ముఖ్యంగా ఓవర్శిస్ లో నాని సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది..గత సినిమాలు హిట్ కావడంతో అందరికి "నిన్ను కోరి" సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి.


జూలై 7న విడుదల

జూలై 7న విడుదల

ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్, సాంగ్స్ మూవీపై భారీ అంచనాలు పెంచాయి. ఇక తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఇందులోని డైలాగ్స్, మ్యూజిక్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చాయి. జూలై 7న విడుదల కానున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.


ఆది పినిశెట్టి

ఆది పినిశెట్టి

నివేదా థామస్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి క్రూషియల్ రోల్ లో కనిపించనున్నాడు. గోపి సుందర్ సంగీతం అందించిన ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు. ట్రైల‌ర్ ఈరోజే.. బ‌య‌ట‌కు వ‌దిలారు. ఓ ల‌వ్ స్టోరీ.. వినోదం.. బ్రేక‌ప్‌... విర‌హం... క‌థ ఇలా సాగ‌బోతోంద‌ని ట్రైల‌ర్‌లో తెలిసిపోతోంది. నాని టైమింగ్‌, జోవియ‌ల్ న‌ట‌న‌.. ట్రైల‌ర్‌లో మ‌రోసారి ప్ర‌స్పుటంగా క‌నిపిస్తోంది.
ఇంట్రస్ట్ పెంచేలా ట్రైలర్

ఇంట్రస్ట్ పెంచేలా ట్రైలర్

తననే ప్రేమించా.. తననే పెళ్లిచేసుకోవాలనుకున్నా.. చావైనా బ్రతుకైనా తనతోనే అనుకున్నా అంటూ నాని చెప్పిన డైలాగ్ సినిమా మీద మరింతగా అంచనాలను పెంచేలా ఉంది. మొత్తానికి కథ మీద ఆసక్తీ, సినిమా మీద ఇంకొంత ఇంట్రస్ట్ పెంచేలా ట్రైలర్ కట్ చేసారు.


మ్యూజిక్ బాగా ప్ల‌స్

మ్యూజిక్ బాగా ప్ల‌స్

ఇదో రొమాంటిక్ కామెడీ మూవీ.. ఎమోష‌న్లు కూడా బ‌లంగా ద‌ట్టించిన‌ట్టు అనిపిస్తోంది. `వ‌న్స‌పానె టైములో... వైజాగ్ బిచు రోడ్డులో` అనే పాట‌... కొంత‌కాలం వినేలా ఉంది. ఇప్ప‌టికే `నిన్ను కోరి` కోసం విడుద‌ల చేస్తున్న ఓ గీతం శ్రోతల్ని ఆక‌ట్టుకొంది. మొత్తానికి గోపీసుంద‌ర్‌ మ్యూజిక్ ఈ సినిమాకి బాగా ప్ల‌స్ అయ్యేలా క‌నిపిస్తోంది.


హిట్టు గ్యారెంటీ

హిట్టు గ్యారెంటీ

ఆది పినిశెట్టి పాత్ర ఈ చిత్రంలో కీల‌కం కానుంది. ఆ పాత్ర పడింతే.. సినిమా హిట్టు గ్యారెంటీ. దానికి తోడు.. నాని ఓ డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. `నీకు అర్థం అవుతోందా... నా గెలుపు ఆల్రెడీ మొద‌లైపోయింది` అనే డైలాగ్ తో పూర్తయిన ఈ ట్రైలర్ లో చివరగా నాని లుక్ ఇంట్రస్టింగ్ గా కనిపిస్తోంది.


నాని ఖాతాలో ఇంకో హిట్

ట్రైలర్ లో నాని, నివేదా, ఆది ముగ్గురే కనిపించడం విశేషం.. సినిమా కూడా ఈ ముగ్గురి మధ్యే నడుస్తుందని చెప్పకనే చెప్పాడు దర్శకుడు. సరైనోడు తర్వాత ఆది పినిశెట్టి నటిస్తున్న తెలుగు సినిమాగా నిన్ను కోరి సూపర్ క్రేజ్ సంపాదించింది. సో..! నాని ఖాతాలో ఇంకో హిట్ పడిపోయింది అని ఇప్పుడే ఫిక్స్ అయిపోవచ్చు అనేంతగా ఆకట్టుకుందీ ట్రైలర్...English summary
finally, the trailer "Ninnu Kori" was launched today and it looks like there’s a hit for Nani again.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu