For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘పైసా’ కోసం కృష్ణవంశీ-నాని కష్టం (వర్కింగ్ స్టిల్స్)

  By Srikanya
  |

  హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ ప్రస్తుతం నాని హీరోగా రూపొందిస్తున్న చిత్రం 'పైసా' . డబ్బు వల్ల మానవ సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. అందరూ డబ్బు మాయలో పడి జీవితపు ఆనందాల్ని విస్మరిస్తున్నారు.. అన్న తాత్విక దృష్టికోణంలో 'పైసా' సినిమా తీశాను అన్నారు కృష్ణవంశీ.

  సుదీర్ఘ విరామం తర్వాత ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'పైసా'. '11 ఇన్‌కార్నేషన్' అని ఉపశీర్షిక. నాని హీరో . కాథరిన్, సిద్ధికా శర్మ హీరోయిన్స్. ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై రమేష్‌పుప్పాల నిర్మించారు.రాజకీయాల నేపథ్యంలోనే సినిమా ఉంటుందని, యంగ్ పొలిటిషీయన్ గా హీరో పాత్ర ఆదర్శ వంతంగా ఉంటుందని చెప్తున్నారు.

  గోపీచంద్ మొగుడు తర్వాత కృష్ణవంశీ చేస్తున్న చిత్రం ఇదే. ఆ చిత్రం డిజాస్టర్ కావటంతో కొంత గ్యాప్ తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మొదట ఈ చిత్రానికి పైసాలో పరమాత్మ టైటిల్ అనుకున్నారు. ఆ తర్వాత జెండాపై కపిరాజు అని వార్తలు వచ్చాయ. అయితే పైసాలో పరమాత్మ టైటిల్ వేరే వారు తమ సినిమాకు పెట్టుకుని ఉండటంతో పైసా టైటిల్ ని ఈ చిత్రానికి ఫిక్స్ చేసారు.

  ఈ చిత్రం వర్కింగ్ స్టిల్స్...

  కృష్ణవంశీ మాట్లాడుతూ.. ‘కథ తయారుచేసుకున్నప్పుడే నాని హీరో అయితే బాగుంటుందనుకున్నాను. ఆయన పాత్ర చిత్రణలో భిన్న పార్శాలుంటాయి. సరికొత్త పంథాలో తెరకెక్కిన చిత్రమిది. డబ్బు 11వ అవతారం అని అర్థం స్ఫురించేలా టైటిల్ ఉపశీర్షిక పెట్టాం. చాలా కాలం తర్వాత చరణ్‌రాజ్ విలన్‌గా నటిస్తున్నారు. ' అన్నారు.

  నిర్మాత రమేష్‌పుప్పాల మాట్లాడుతూ ‘ఈ సినిమాను ఓ యజ్ఞంలా భావించి పూర్తిచేశాం. దర్శకుడు కృష్ణవంశీ సినిమాను అద్భుతమైన రీతిలో తెరకెక్కించాడు. నిర్మాణపరంగా ఎక్కడా రాజీపడలేదు. దుబాయ్, మలేషియాలో చిత్రీకరణ జరిపాం. మా సంస్థకు మంచి పేరు తెచ్చే చిత్రమవుతుంది' అన్నారు.

  నాని మాట్లాడుతూ ‘నా అభిమాన దర్శకుడు కృష్ణవంశీ. ‘మురారి' సినిమా విడుదలైనప్పుడు హైదరాబాద్ సత్యం థియేటర్ వద్ద టిక్కెట్ల కోసం చాలా పాట్లు పడ్డాను. అలాంటిది ఈ రోజు ఆయన దర్శకత్వంలో హీరోగా నటించడం మరచిపోలేని అనుభూతినిస్తోంది. ‘పైసా' చిత్రంలో సమాజానికి గొప్ప సందేశం వుంటుంది. సాయికార్తీక్ మంచి సంగీతం అందించాడు' అన్నారు.

  ఈ చిత్రం తన పాత్ర డిఫెరెంట్ గా ఉంటుందని నాని చెప్తూ...కృష్ణవంశీ దర్శకత్వంలో చేస్తున్న ‘పైసా' నాకు పూర్తి స్థాయి వృత్తి సంతృప్తినిచ్చింది. పాతబస్తీలో ఓ షేర్వాణీ షాపు మోడల్‌గా ఇందులో కనిపిస్తా. ఇందులో సరికొత్త నానీని చూస్తారు అన్నారు

  కాస్టూమ్స్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. నాని కాస్ట్యూమ్స్ కోసం స్వారోవ్‌స్కి క్రిస్టల్స్ వాడుతున్నారట. ఓక్కో సూట్ కోసం దాదాపు 20 వేల క్రిస్టల్స్ వాడుతున్నారు. వీటితో తయారు చేసే ఒక్కో సూట్ కు రూ. 7.5 లక్షల వరకు ఖర్చవుతుందట. ఇప్పటి వరకు ఇండియాలో ఏ హీరో కూడా ఇలాంటి సూట్ తో పెర్ఫార్మ్ చేయలేదట.

  చిత్రంలో నాని పేరు ప్రకాష్. దాన్ని ప్ర...కాష్ అని క్యాష్ అని అర్దం వచ్చేలా ప లుకుతారు. ఈ చిత్రానికి కెమెరా: సంతోష్‌కుమార్ రాయ్, సంగీతం: సాయికార్తీక్, పాటలు: సిరివెన్నెల, అనంత్‌శ్రీరామ్, ఆర్ట్: బ్రహ్మ కడలి.

  English summary
  
 Paisa which is Krishna Vamsi’s latest directorial venture starring Nani and debut actress Catherine and Lucky Sharma in the lead roles. Recently when Tollywood’s well known close associate of the director, visited the sets described the song as splendid..It is revealed that Krishna Vamsi, who is already well known for his evergreen song sequences has come up with a never experienced creative conceptual picturisation for the song. The producers have allocated more than Rs.1 crore without even a second thought as it is likely expected to break records and it is going to be the best of his creativity so far.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X