‘టక్ జగదీష్’ నుంచి సర్‌ప్రైజింగ్ పోస్టర్: ఇప్పటి వరకూ కనిపించని లుక్‌లో నాని

ఎన్నో సినిమాల్లో సహజసిద్ధమైన నటనతో మెప్పించి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు నేచురల్ స్టార్ నాని. కెరీర్ ఆరంభంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన అతడు... 'అష్టాచెమ్మ'తో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో భారీ చిత్రాల్లో నటిస్తోన్న నాని.. ప్రస్తుతం పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. వాటిలో శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న 'టక్ జగదీష్' ఒకటి. క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా నుంచి సర్‌ప్రైజింగ్ పోస్టర్ విడుదల అయింది.

'నిన్ను కోరి' తర్వాత నాని - శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'టక్ జగదీష్'. షైస్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, పెద్ది హరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ నటిస్తున్నారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇందులో క్లాస్ లుక్‌లో దర్శనమిచ్చిన నాని.. ఒక చేత్తో భోజనం చేస్తూ.. మరో చేతితో కత్తిని పట్టుకుని ఉన్నాడు. తొలిసారి అతడి చేతితో కత్తి కనిపించడంతో అంతా షాక్‌ అవుతున్నారు.

Nanis Tuck Jagadish First Look Released

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లోనే 'టక్ జగదీష్' విడుదలపై క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ మేరకు దాని మీద '2021 ఏప్రిల్‌లో బాక్సాఫీస్‌ను స్టక్ చేయబోతున్నాం' అని రాసుకొచ్చారు. దీంతో నాని అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక, ఈ సినిమాతో పాటే నేచురల్ స్టార్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'అంటే.. సుందరానికీ' అనే సినిమాతో పాటు 'ట్యాక్సీవాలా' ఫేమ్‌ రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో 'శ్యామ్ సింగరాయ్' అనే చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ రెండు చిత్రాలు కూడా అధికారికంగా ప్రారంభం అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X