»   » ‘అలా మొదలైంది’కి పూర్తి విరుద్దంగా ‘సెగ’ జూన్ లో

‘అలా మొదలైంది’కి పూర్తి విరుద్దంగా ‘సెగ’ జూన్ లో

Posted By:
Subscribe to Filmibeat Telugu

'నేను, అంజన క్లాస్ మేట్స్ మి. తను చాలా ప్రతిభావంతురాలు. 'అలా మొదలైంది" కాన్సెప్ట్ తనదే. నా స్నేహితురాలు 'సెగ"సినిమాతో ఒకేసారి తెలుగు తమిళ భాషల్లో పరిచయమవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో అన్నిరకాల హ్యూమన్ ఎలిమెంట్స్ ఉంటాయని దర్శకురాలు నందినీ రెడ్డి చెప్పారు.

నానీ, నిత్యామీనన్, బిందుమాధవి కాంబినేషన్ లో అంజన దర్శకత్వంలో మనదేశం మూవీస్ పతాకంపై అశోక్ వల్లభనేని నిర్మిస్తున్న చిత్రం 'సెగ". నిర్మాత మాట్లాడుతూ 'ఇటీవల ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఆడియోకు విశేషాదరణ లభిస్తోంది. జోష్పా శ్రీధర్ సంగీతం క్లాస్ నీ మాస్ నీ ఆకట్టుకుంటోంది. 'అలా మొదలైంది" కి పూర్తి విరుద్దంగా ఉంటుంది ఈ సినిమా. చాలా థ్రిల్లింగ్, హార్ట్ ని టచ్ చేసే విధంగా సన్నివేశాలు ఉంటాయి. ఒక మాస్ సినిమాని ఎంత క్లాస్ గా తీయొచ్చో అంజన ఈ సినిమాలో చేసి చూపించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంతో జరుగుతున్నాయి. జూన్ లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని తెలిపారు.

English summary
Young star Nani and cute girl Nithya Menon's combination in Nandini Reddy's 'Ala Modalaindi' was a blockbuster hit.This low budget film turned out to be a super hit in all the centers and is heading towards 100 days across the state.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu