Don't Miss!
- News
జనసైనికులకు రాం గోపాల్ వర్మ కీలక సూచన..!!
- Finance
Jio, Airtel: జియో, ఎయిర్‌టెల్‌కు పెరిగిన డిమాండ్.. !
- Lifestyle
గర్భిణీ స్త్రీలకు ఈ ఆహారం చాలా ముఖ్యం; ఈ పండ్లు మరియు కూరగాయలు తింటే తల్లి బిడ్డ క్షేమం..
- Sports
అర్ష్‌దీప్ సింగ్ వైఫల్యానికి కారణం అదే: మహమ్మద్ కైఫ్
- Technology
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
తెలుగు హీరోలపై నాని సంచలన వ్యాఖ్యలు: వకీల్ సాబ్ నుంచే అసలు సమస్య.. వాళ్లు అలా చేయడం వల్లేనంటూ!
రెండేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీకి దెబ్బల మీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. వరుసగా రెండు సంవత్సరాలు లాక్‌డౌన్ల కారణంగా థియేటర్లు మూతపడడం, షూటింగ్‌లు నిలిచిపోవడం వంటి వాటితో చాలా నష్టాలు ఎదురయ్యాయి. ఈ గాయాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న సినీ పరిశ్రమకు టికెట్ల రేట్ల వివాదం తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లను ఒక్కసారిగా తగ్గించడంతో మంచి టాక్ ఉన్న సినిమాలు సైతం నష్టాలను ఎదుర్కొవాల్సి వచ్చింది.
దీనిపై అప్పట్లో పవన్ కల్యాణ్, నాని గళమెత్తారు. మళ్లీ ఇటీవలే నేచురల్ స్టార్ మాట్లాడాడు. దీంతో మరికొంత మంది ముందుకు వస్తారని అంతా అనుకున్నా అలా జరగలేదు. ఈ నేపథ్యంలో నాని టాలీవుడ్ ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు మీకోసం!

టికెట్ రేట్లను తగ్గించిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలను కొన్ని థియేటర్లు దోచుకుంటున్నాయని, ప్రతి ఒక్కరికీ వినోదాన్ని తక్కువ ధరలకే అందించాలనే లక్ష్యంతో.. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ జీవో నెంబర్ 35ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం.. రాష్ట్రంలోని థియేటర్లలో ఏరియాను బట్టి రేట్లను నిర్ణయించారు. ఆ ధరలకే టికెట్లు అమ్మాలని కఠినంగా హెచ్చరించారు.
Bigg Boss Remunerations: సన్నీ, షన్నూ కంటే అతడికే ఎక్కువ.. మధ్యలో వెళ్లినా కోటి పైనే.. ఎవరికి ఎంత?

కోర్టుకు చేరింది... ఆ తీర్పుతో ఇలా
ఏపీలో సినిమా టికెట్ల రేట్లు తగ్గిసూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 35ను సవాల్ చేస్తూ పలు థియేటర్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పిటీషనర్లకు వెసలుబాటు కల్పించిన న్యాయస్థానం.. రేట్ల పెంపునకు జాయింట్ కలెక్టర్ల అనుమతి తీసుకోవాలని సూచించింది. అలా తీసుకోని థియేటర్లపై దాడులు చేస్తూ అధికారులు వాటని సీజ్ చేస్తున్నారు.

తీవ్రం అయిన టికెట్ రేట్ల సమస్య
ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల తగ్గుదల సమస్య రోజు రోజుకూ మరింత తీవ్ర తరం అవుతోంది. దీంతో చాలా సినిమా హాళ్లు స్వచ్చందంగా మూతపడుతున్నాయి. ఇందులో సింగిల్ స్క్రీన్ థియేటర్ల నుంచి మల్టీఫ్లెక్స్‌లు కూడా ఉన్నాయి. దీంతో కొత్తగా విడుదల అవుతున్న సినిమాలపై ఈ ప్రభావం భారీ స్థాయిలో పడుతోంది. దీంతో ఏపీలో మాత్రం కలెక్షన్లు చాలా తగ్గిపోయాయి.
హాట్ ఫోజులతో షాకిచ్చిన రష్మిక మందన్నా: చీరకొంగును పక్కకు జరిపి మరీ.. ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

హీరో నాని అప్పుడలా.. ఇప్పుడిలా
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి జఠిలం అవుతోన్నా సినీ పరిశ్రమలోని హీరోలు గానీ, పెద్దలు కానీ గట్టిగా స్పందించడం లేదు. రిపబ్లిక్ మూవీ ఫంక్షన్‌లో పవన్ దీనిపై గట్టిగా వాదనను వినిపించాడు. ఆ తర్వాత నాని థియేటర్ల సమస్యపై మాట్లాడాడు. మళ్లీ ఇటీవలే రేట్లు తగ్గించడంపై స్పందిస్తూ.. ప్రేక్షకులను అవమానపరిచారంటూ పేర్కొన్నాడు. దీంతో అతడిని వైసీపీ వాళ్లు విమర్శించారు.

వాళ్లపై నాని సంచలన వ్యాఖ్యలు
ఏపీలో నెలకొన్న పరిస్థితులపై హీరో నాని మాట్లాడినా.. అతడికి ప్రేక్షకుల నుంచి మద్దతు లభించింది కానీ.. సినీ పెద్దలు మాత్రం సపోర్ట్ చేయడం లేదు. ఒకరిద్దరు హీరోలు మాత్రమే అతడి వ్యాఖ్యలను సమర్ధించారు. ఇలాంటి తరుణంలో హీరో నాని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో అతడు టాలీవుడ్‌లోని హీరోలు, ప్రముఖులపై వ్యాఖ్యలు చేశాడు.
ప్రియుడి నగ్న ఫొటోను షేర్ చేసిన శృతి హాసన్: అతడి ముందు అలా కూర్చుని.. పరువు తీసేసిందిగా!

వకీల్ సాబ్ నుంచే అసలు సమస్య
ఓ ప్రముఖ సంస్థకు చెందిన యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన నాని.. అందులో ఆంధ్రప్రదేశ్ టికెట్ రేట్ల వివాదంపై మాట్లాడాడు. 'ఈ సమస్య ఇప్పటికి పెద్దదిగా మారింది. వకీల్ సాబ్ అప్పుడే అందరూ మాట్లాడాల్సింది. అప్పుడు ఎవరూ తమ గొంతును వినిపించలేదు. అందుకే ఈ సమస్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దీని కోసం గట్టిగా మాట్లాడాలి' అని చెప్పుకొచ్చాడు.

ఆ పని చేయకపోవడం వల్లే అంటూ
ఇదే ఇంటర్వ్యూలో టాలీవుడ్‌లో ఐకమత్యంపైనా నాని షాకింగ్ కామెంట్స్ చేశాడు. 'ఇండస్ట్రీలో ఎవరికి వాళ్లు తమ సినిమా వచ్చినప్పుడు మాట్లాడదాంలే అనుకుని ఆగిపోతున్నారు. మొదట్లోనే దీనిపై మాట్లాడి ఉంటే పరిష్కారం అయిపోయేది. అందరూ ఒక వేదిక మీదకు వచ్చి దీనిపై స్పందించాలి. కానీ, టాలీవుడ్‌లో యూనిటీ లేదు. అందుకే ఇలా జరుగుతుంది' అని వివరించాడు.