»   »  ఐడియా ఉంది... పద్మిని తెచ్చిపెట్టా

ఐడియా ఉంది... పద్మిని తెచ్చిపెట్టా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇప్పుడు టాలీవుడ్ లో రీమేక్ సీజన్ నడుస్తోంది. దాదాపు ప్రతీ హీరో రీమేక్ వైపు మ్రొగ్గు చూపుతున్నాడు. తాజాగా కెరీర్ లో రీమేక్ లు చేయని నాని సైతం ఓ తమిళ రీమేక్ తో మన ముందుకు రావటానికి ఉత్సాహం చూపిస్తున్నాడు.

రీసెంట్ గా విడుదలైన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ' కు పాజిటివ్ టాక్ రన్ అవుతూండటంతో నాని ఆ ఉత్సాహంలో ఇంద్రగంటి మోహన్ కృష్ణతో చేస్తున్న చిత్రం ధమాకా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మరో ప్రక్కన తన దగ్గర రైట్స్ ఉన్న తమిళ రీమేక్ ని పట్టాలు ఎక్కించటానికి ప్రయత్నిస్తున్నాడు.

Nani to star in a remake

''ఆ సినిమా రీమేక్‌ రైట్స్‌ నా దగ్గరే ఉన్నాయి. అది ఎప్పుడో మొదలవుతుందో తెలియదు. ఆ చిత్రాన్ని నేనే నిర్మిస్తానా లేదా అన్నది కూడా చెప్పలేను. ఈ సినిమా బాగా నచ్చి రీమేక్‌ చేయాలన్న ఉద్దేశంతో ఫియట్‌ పద్మిని కారు కూడా కొని గ్యారేజ్‌లో పెట్టాను'' అని నాని వెల్లడించాడు.

తమిళ కామెడీ డ్రామా చిత్రం "పణియారం పద్మినియుమ్" రీమేక్ రైట్స్ తీసుకున్నారు. ఓ లాండ్ లార్డ్ కి అతని పద్మినికారు కి సంభందించిన కథ ఇది. తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా చేసారు. సినిమా వైవిధ్యమైన సినిమాగా మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులో రాజేంద్రప్రసాద్ ఓ కీలకమైన పాత్రలో చేస్తారని తెలుస్తోంది. దర్శకుడు ఎవరనేది ఇంకా నిర్ణయం కాలేదు.

English summary
Nani said he hasn't shelved the idea of remaking Tamil hit ‘Pannaiyarum Padminiyum’ starring Vijay Sethupathi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu