»   »  రాజమౌళి కి అసిస్టెంట్ డైరెక్టర్ గా నాని

రాజమౌళి కి అసిస్టెంట్ డైరెక్టర్ గా నాని

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈగ తో నటుడిగా నాని కి బ్రేక్ ఇచ్చిన రాజమౌళి డైరెక్టర్ గ కూడా నాని కి మరో సారి బూస్టింగ్ ఇవ్వనున్నాడట. అందుకే అడగ్గానే తనదగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేర్చుకొవటానికి అంగీకరించాడట. అంటే రాజమౌళి, నాని మళ్ళీ కలిసి పనిచేయనున్నారన్న మాట. అదికూడా రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా నాని కాంబినేషన్లో....

అయితే ఇలా నాని కనిపించేది, ఆయన తాజాగా చేయనున్న సినిమాలో మాత్రమే. త్వరలో 'జెంటిల్ మన్'గా ప్రేక్షకుల ముందుకు రానున్న నాని, ఆ తరువాత విరించి వర్మతో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని అసిస్టెంట్ డైరెక్టర్ పాత్రను పోషించనున్నాడట. అంటే నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేది రాజమౌళి కింద అన్నమాట... అలా నాని సినిమాలో రాజమౌళి నటించనున్నారు.

 Nani turns Assistant director to Rajamouli

ఈసినిమాలో నాని చేస్తున్న పాత్ర ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అని తెలుస్తోంది. సహజత్వం కోసం నాని దర్శకుడు రాజమౌళి దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నట్లు కొన్ని సీన్స్ తీస్తారట. దర్శకుడు రాజమౌళి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ రెండు .. మూడు సార్లు ఆయన ఈ సినిమాలో కనిపిస్తాడని అంటున్నారు.

నాని హీరో కాకముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. గతంలోని తన పాత్రను ఇప్పుడు హీరోగా ఆయన పోషించనున్నాడన్న మాట. నాని పాత్ర కామెడీ టచ్ తో కొనసాగుతుందనీ, ఆయన సరసన అనూ ఇమాన్యుయెల్ నటించనుందని చెబుతున్నారు.
అంతా బావుంది గానీ...... ఇంతకీ ఇప్పుడు రాజమౌళి సినిమాకి నాని పని చేసినట్టా ...? నాని సినిమాకి రాజమౌళి పని చేసినట్టా...?

English summary
SS Rajamouli make a cameo in Nani's Movie with virinchi Varma
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu