»   » వరుణ్ సందేశ్ దొబ్బించుకోవడానికి నాని సాయం

వరుణ్ సందేశ్ దొబ్బించుకోవడానికి నాని సాయం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరుణ్ సందేశ్, సందీప్ కిషన్ ప్రధాన పాత్రధారులుగా సిరాజ్ కల్లా దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'డి ఫర్ దోపిడి'. దొబ్బడానికి? దొబ్బించుకోవడానికా? అనే కాప్షన్ తో వస్తున్న ఈ చిత్రానికి నాని వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు. ఈ మధ్య కాలంలో హీరోలో, దర్శకులో వేరే వారి చిత్రాలకి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఇదే కోవలో నాని కూడా నడుం కట్టి తన తోటి హీరో వరుణ్ సందేశ్ చిత్రానికి ఇలా గొంతు ఇస్తున్నారు. హిందీలో '99', 'షోర్ ఇన్ ద సిటీ' చిత్రాలకు దర్శకత్వం వహించిన రాజ్ నిడిమోరు, కృష్ణా డి.కెలు 'డి ఫర్ దోడిపి' చిత్రాన్ని తెలుగులో నిర్మించబోతున్నారు. సిరాజ్ కల్లాన్ని ఈచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.


నిర్మాతలు మాట్లాడుతూ... తాము బాలీవుడ్‌లో దర్శకులుగా విజయం సాధిస్తున్నా తెలుగులో చిత్రం నిర్మించాలని సిరాజ్ కల్లా చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రం నిర్మించామని, దర్శకుడి పనితనం చిత్రమంతా అద్భుతంగా కన్పిస్తుందని వారు తెలిపారు. సరికొత్త స్క్రిప్ట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో దేవా కట్టా ఏసిపి కృష్ణమాచార్యగా నటించారని, రొటీన్ కథలకు పూర్తి భిన్నంగా ఉండే ఈ చిత్రంలో లోకల్ ఫ్లేవర్స్ కన్పిస్తారని వారు వివరించారు. ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకంతో కొత్తగా చేసిన ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని వారు వివరించారు.

నలుగురు యువకులు తమ వ్యక్తిగత అవసరాల కోసం బ్యాంక్ దోపిడికి ప్లాన్ చేస్తారు. ఆ క్రమంలో వారు అనుకోకుండా కొన్ని ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. అవేమిటో తెలుసుకోవాలంటే 'డి ఫర్ దోపిడీ' చిత్రాన్ని చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు సిరాజ్‌కల్లా. ' డి 2 ఆర్ ఫిల్మ్స్ పతాకంపై రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్‌సందేశ్, సందీప్‌కిషన్, నవీన్, రాకేష్, మెలనీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వాలెంటైన్స్ డే కానుకగా పిభ్రవరి 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

క్రైం, కామెడీ నేపథ్యంలో ఈచిత్రం సాగుతుంది. ప్రేక్షకులకు సస్పెన్స్ తో పాటు థ్రిల్, కామెడీని ఈచిత్రం నుంచి ఆశించ వచ్చు. ఈ చిత్రంలో ఇంకా తనికెళ్ల భరణి, హేమ, పృథ్వి, పావలా శ్యామల తదితరులు నటిస్తున్నారు. సంగీతం: మహేష్ శంకర్, కెమెరా: లుకాస్, కళ: ఉపేంద్ర రెడ్డి, కూర్పు: ధర్మేంద్ర, నిర్మాతలు: రాజ్ నిడిమోరు, కృష్ణా డి.కె, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సిరాజ్ కల్లా.

English summary
Nani who is turning himself into a star with series of successful movies is giving his voice over to Varun Sandesh, Sundeep starrer heist comedy 'D for Dopidi'. Siraj Kalla is directing this film which runs in the back drop of a bank robbery. 'Shore in the city' fame Raj DK is producing this film which is set to release on Feb 14th. Mahesh Shankar is scoring the music for this film. Trailer that is released already has set decent expectations on the movie.
Please Wait while comments are loading...