»   » అడల్ట్ మూవీ కాదు: నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ సెన్సార్ రిపోర్ట్

అడల్ట్ మూవీ కాదు: నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ సెన్సార్ రిపోర్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేసి ప‌దేళ్లుగా మంచి చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన నిర్మాత బెక్కం వేణుగోపాల్‌(గోపి) రీసెంట్‌గా సినిమా చూపిస్త మావ‌తో సూప‌ర్‌హిట్ సాధించిన సంగ‌తి తెలిసిందే.

ల‌క్కీ మీడియా బ్యానర్‌పై భాస్క‌ర్ బండి ద‌ర్శ‌క‌త్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌. రావు ర‌మేష్‌, హెబ్బా ప‌టేల్‌, తేజ‌స్వి మ‌డివాడ‌, అశ్విన్, పార్వ‌తీశం, నోయెల్ సేన్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది.


నిర్మాత మాట్లాడుతూ...

నిర్మాత మాట్లాడుతూ...

ఈ సంద‌ర్భంగా...నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ - ``అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందే సినిమాల‌ను రూపొందించే మా ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌పై రూపొందిన చిత్రం `నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌`. హెబ్బా, రావు ర‌మేష్‌, అశ్విన్‌, నోయెల్‌, పార్వ‌తీశం, తేజ‌స్విని స‌హా అంద‌రూ బాగా స‌పోర్ట్ చేయ‌డంతో సినిమా బాగా వ‌చ్చిందని తెలిపారు.


దిల్ రాజు రిలీజ్ చేస్తుండటంతో భారీ క్రేజ్

దిల్ రాజు రిలీజ్ చేస్తుండటంతో భారీ క్రేజ్

ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజుగారు సినిమా చూడ‌గానే సినిమాను వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు. దిల్‌రాజుగారు సినిమాను రిలీజ్ చేస్తుండ‌టంతో సినిమాపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.రీసెంట్‌గా విడుద‌లైన పాట‌ల‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి స్పంద‌న వ‌స్తుంది.


సెన్సార్ రిపోర్ట్

సెన్సార్ రిపోర్ట్

సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని `యు/ఎ` స‌ర్టిఫికేట్‌ను పొందింది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అంద‌రూ ఎంజాయ్ చేసేలా రూపొందిన ఈ సినిమాను డిసెంబ‌ర్ 16న విడుద‌ల చేస్తున్నాం`` అన్నారు.


ట్రైలర్

రావు ర‌మేష్‌, హెబ్బా ప‌టేల్‌, తేజ‌స్వి మ‌డివాడ‌, అశ్విన్, పార్వ‌తీశం, నోయెల్ సేన్‌, కృష్ణ‌భ‌గ‌వాన్‌, స‌నా, తోట‌ప‌ల్లి మ‌ధు, ధ‌న‌రాజ్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, చ‌మ్మ‌క్ చంద్ర త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి క‌థః బి.సాయికృష్ణ‌, పాటలుః చంద్ర‌బోస్‌, భాస్క‌ర‌భ‌ట్ల‌, వ‌రికుప్ప‌ల యాద‌గిరి, కాస‌ర్ల శ్యామ్‌, కొరియోగ్ర‌ఫీః విజ‌య్ ప్ర‌కాష్‌, స్టంట్స్ః వెంక‌ట్‌, స్క్రీన్‌ప్లే, మాట‌లుః బి.ప్ర‌స‌న్న‌కుమార్‌, ఎడిట‌ర్ః చోటా కె.ప్ర‌సాద్‌, ఆర్ట్ః విఠ‌ల్ కోస‌నం, మ్యూజిక్ః శేఖ‌ర్ చంద్ర‌, సినిమాటోగ్ర‌ఫీః చోటా కె.నాయుడు, ప్రొడ‌క్ష‌న్ః ల‌క్కీ మీడియా, నిర్మాతః బెక్కం వేణుగోపాల్‌(గోపి), ద‌ర్శ‌క‌త్వంః భాస్క‌ర్ బండి.


English summary
Nanna Nenu Naa Boy Friends censor report U/A. Watch & Enjoy Nanna Nenu Naa Boyfriends Movie Theatrical Trailer. Starring Rao Ramesh, Hebah Patel, Tejaswi Madivada, Ashwin, Parvateesam, Noel Sean, Krishna Bhagavan, Sana, Thotapalli Madhu, Dhan Raj, Jabardasth Shakalaka Shankar, Jabardasth Chammak Chandra. Music by Sekhar Chandra. Directed by Bhaskar Bandi.Under The Banner Of Sri Venkateshwara Creations & Lucky Media.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu