Don't Miss!
- Finance
pmay: ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? ఇది మీ కోసమే..
- Sports
INDvsNZ : రెండో టీ20 పిచ్ రిపోర్ట్.. డేంజర్లో టీమిండియా రికార్డు!
- News
మా నాన్న జోలికి వస్తే సహించం - తమ్ముడంటే ప్రాణం: రాం చరణ్ వార్నింగ్..!!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్...జయలలితకి డేడికేట్ చేసిన దిల్ రాజు
హైదరాబాద్: లక్కీ మీడియా బ్యానర్‌పై భాస్కర్ బండి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్. రావు రమేష్, హెబ్బా పటేల్, తేజస్వి మడివాడ, అశ్విన్, పార్వతీశం, నోయెల్ సేన్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ఈచిత్రాన్ని దిల్ రాజు బ్యానర్ తన 'శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్' ద్వారా విడుదల చేస్తున్నారు.
శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది.ఆడియో సీడీలను హీరో నాని విడుదల చేసి సీడీలను దిల్ రాజు, శిరీష్,లక్ష్మణ్ కు అందించారు.

జయకు అంకితం చేసిన దిల్ రాజు
దిల్‌రాజు మాట్లాడుతూ - ``నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స చిత్రాన్ని జయలలితగారికి డేడికేట్ చేస్తున్నాం. శేఖర్ చంద్ర ప్రతి సాంగ్‌ను డిఫరెంట్‌గా చేశాడు. టీం బాగా కష్టపడి చేశారు. సినిమా చూశాను, నాకు బాగా నచ్చింది. హెబ్బా కోసం యూత్ సినిమా చూస్తారు. కూతురున్న తండ్రి ఈ సినిమా చూస్తారు. అలాగే ప్రతి అమ్మాయి ఈ సినిమా చూస్తుంది. మంచి తండ్రి కూతుళ్ల మధ్య మంచి అనుబంధం ఉండే సినిమా. మ్యూజిక్, ఎంటర్‌టైన్మెంట్ అన్నీ కుదిరిన సినిమా. డిసెంబర్ 16న సినిమా రిలీజ్ అవుతుంది. టీంకు ఆల్ ది బెస్ట్`` అన్నారు.

దర్శకుడు భాస్కర్ బండి మాట్లాడుతూ -
సాయికృష్ణ మంచి కథ అందిస్తే, ప్రసన్న మంచి డైలాగ్స్ అందించారు. శేఖర్ చంద్రగారు మంచి ట్యూన్స్‌తో పాటు మంచి ఆర్.ఆర్. ఇచ్చారు. అలాగే బెక్కం వేణుగోపాల్‌గారు కథను నమ్మి సినిమా డైరెక్టర్‌గా అవకాశం అందించారు.మంచి ప్రాజెక్ట్ రావడానికి అందరూ సపోర్ట్ చేశారు. దిల్‌రాజుగారు సినిమా చూసి బావుందని అప్రిసియేట్ చేయడమే కాకుండా సినిమాను విడుదల చేస్తున్నారు. దిల్‌రాజుగారి వల్ల మా సినిమా మరో స్టెప్ ఎదిగింది. హెబ్బా, తేజస్విని, నోయెల్, అశ్విన్‌బాబు, పార్వతీశం అందరూ సినిమా కోసం చక్కగా పనిచేశారు`` అన్నారు.

హీరో నాని మాట్లాడుతూ -
``నేను లోకల్‌కు పనిచేసిన సగం టీం ఈ సినిమాకు పనిచేసింది. హెబ్బా కంటిన్యూ సక్సెస్‌లు కొడుతుంది. ఈ సినిమా కూడా సక్సెస్ కొట్టాలి. తేజస్విని మంచి హైపర్ యాక్టివ్ పర్సన్. ఈ సినిమా తనకు స్టెప్పింగ్ స్టోన్ కావాలి. అలాగే నోయెల్, అశ్విన్, పార్వతీశంకు ఈ సినిమా మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను. శేఖర్ చంద్ర నాకు ఇష్టమైన సంగీత దర్శకుల్లో ఒకరు. గుండె చప్పుడు.. అనే సాంగ్ ఈ ఆల్బమ్‌లో నాకు బాగా నచ్చింది. గోపిగారు చాలా మంచి ప్రొడ్యూసర్. చాలా పాజిటివ్ పర్సన్. దిల్‌రాజుగారు ఈ సినిమాను విడుదల చేస్తుండటం చాలా మంచి విషయం. ఐదు సినిమాలు సెట్స్‌లో ఉన్నా మంచి సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. 2017 దిల్‌రాజుగారికి చాలా మంచి ఏడాది అవుతుంది. టీంకు ఆల్ ది బెస్ట్`` అన్నారు.

శేఖర్ చంద్ర మాట్లాడుతూ
``లక్కీ మీడియా బ్యానర్లో నేను చేస్తున్న మూడో సినిమా ఇది. గోపిగారికి థాంక్స్. భాస్కర్‌గారు నాకు కావాల్సినంత ఫ్రీడం ఇచ్చి మ్యూజిక్ చేయించుకున్నారు. దిల్‌రాజుగారికి కూడా థాంక్స్. అన్నీ రకాల సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ అందరికీ నచ్చుతాయి. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.

సినిమా చూసిన తర్వాత ప్రతి కూతురు తండ్రి చేయిని ప్రేమగా పట్టుకుంటుంది
మాటల రచయిత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ``ఆరు నెలల క్రితం గోపిగారు ఈ కథను నాకు వినిపించారు. కథలో నాన్న అనే క్యారెక్టర్ సినిమాను చాలా ముందుకు నడిపించింది. సినిమా చూసిన తర్వాత ప్రతి కూతురు తండ్రి చేయిని ప్రేమగా పట్టుకుంటుంది. రెండు గంటల పాటు పూర్తిగా నవ్విస్తుంది. చివరి ఇరవై నిమిషాలు హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. హీరో హీరోయిన్లుగా కథనన నమ్మి వర్క్ చేశారు`` అన్నారు.

నటీనటులు
రావు రమేష్, హెబ్బా పటేల్, తేజస్వి మడివాడ, అశ్విన్, పార్వతీశం, నోయెల్ సేన్, కృష్ణభగవాన్, సనా, తోటపల్లి మధు, ధనరాజ్, షకలక శంకర్, చమ్మక్ చంద్ర తదితరులు నటించారు.

టెక్నీషియన్స్
ఈ చిత్రానికి కథః బి.సాయికృష్ణ, పాటలుః చంద్రబోస్, భాస్కరభట్ల, వరికుప్పల యాదగిరి, కాసర్ల శ్యామ్, కొరియోగ్రఫీః విజయ్ ప్రకాష్, స్టంట్స్ః వెంకట్, స్క్రీన్‌ప్లే, మాటలుః బి.ప్రసన్నకుమార్, ఎడిటర్ః చోటా కె.ప్రసాద్, ఆర్ట్ః విఠల్ కోసనం, మ్యూజిక్ః శేఖర్ చంద్ర, సినిమాటోగ్రఫీః చోటా కె.నాయుడు, ప్రొడక్షన్ః లక్కీ మీడియా, నిర్మాతః బెక్కం వేణుగోపాల్(గోపి), దర్శకత్వంః భాస్కర్ బండి.