For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‌ఎన్టీఆర్ ని పొగిడి ఫొటోలు షేర్ చేసింది (ఫొటోలు )

  By Srikanya
  |

  హైదరాబాద్‌: సుకుమార్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో...'. ఈ చిత్రంలో లండన్‌కు చెందిన లీజా వాన్‌ అనే నటి ప్రత్యేక పాత్రలో కన్పించనున్నారు. లీజా విదేశీ యువతి పాత్రలో ఈ చిత్రంలో నటించారు.

  ఎన్టీఆర్‌తో ఆమె దిగిన ఓ ఫొటోను చిత్ర బృందం ఫేస్‌బుక్‌, ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. 'ఎన్టీఆర్‌తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది, ఆయనతో మాట్లాడుతుంటే.. ఎంతో ప్రేరణ లభిస్తుంది.' అని లీజా అన్నారు.

  'నాన్నకు ప్రేమతో...'. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను వినాయిక చవితి సందర్బంగా ఎన్టీఆర్‌ తన సోషల్ నెట్ వర్కింగ్ ఖాతా ద్వారా విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

  ఇక షూటింగ్‌ సమయంలో ఇతర నటులతో కలిసి దిగిన కొన్ని ఫొటోలను ఆమె ట్వీట్‌ చేశారు. ఆ ఫొటోలను మీరు ఇక్కడ చూడవచ్చు.

  స్లైడ్ షోలో ఆ ఫొటోలు... విశేషాలతో కలిపి

  ద్విపాత్రాభినయం...

  ద్విపాత్రాభినయం...

  ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారం.

  ఇది మూడో సారి..

  ఇది మూడో సారి..

  'ఆంధ్రావాలా'లో తొలిసారి రెండు పాత్రల్లో కనిపించాడు ఎన్టీఆర్‌. ఆ తరవాత 'అదుర్స్‌'లోనూ ఇద్దరిగా వినోదం పంచాడు. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడా? ఔననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు .

  స్టైలిష్ గా...

  స్టైలిష్ గా...

  ఓ పాత్ర కోసం గడ్డంతో, స్త్టెలిష్‌గా కనిపిస్తున్నాడు తారక్‌. ప్రస్తుతం ఆ గెటప్పే చిత్ర బృందం బయటపెట్టింది.

  గెటప్ సీక్రెట్ గా..

  గెటప్ సీక్రెట్ గా..

  అయితే.. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ మరో పాత్రలో కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. ఆ గెటప్‌ను చిత్రబృందం గోప్యంగా ఉంచుతోంది.

  అదే కథ...

  అదే కథ...

  ఈ ఇద్దరి ఎన్టీఆర్‌ల మధ్య ఉన్న సంబంధం ఏమిటన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అదే సినిమాలో కీలకాంశం అంటున్నారు

  పండుగకే...

  పండుగకే...


  సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.ఈ చిత్రం జనవరి 8,2016న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

  దసరాకి..

  దసరాకి..

  ఈ లోగా దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 22న టీజర్ ని విడుదల చేయాలని నిర్ణయించారు.

  దర్శకుడు మాట్లాడుతూ...

  దర్శకుడు మాట్లాడుతూ...

  ''ఎన్టీఆర్‌ని కొత్త తరహా పాత్రలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన తెరపై కనిపించే విధానం భిన్నంగా ఉంటుంది. ఇదివరకటితో పోలిస్తే మరింత స్త్టెలిష్‌గా కనిపిస్తారు. ఎన్టీఆర్‌ కోసం ప్రత్యేకంగా ఓ బైక్‌ని తయారు చేయించాం. అది చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది''అన్నారు.

   నిర్మాత మాట్లాడుతూ ....

  నిర్మాత మాట్లాడుతూ ....

  ''ఎన్టీఆర్‌ సినీ ప్రయాణానికీ, మా సంస్థకి ఎంతో ప్రతిష్ఠాత్మకమైన చిత్రమిది. ఆ తర్వాత స్పెయిన్‌లో జరిగే షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది'' అన్నారు.

  అదే రోజున

  అదే రోజున

  ఈ చిత్రాన్ని తమిళంలో డబ్బింగ్ చేసి అదే రోజు విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు జరగుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కొందరు తమిళ నటుల్ని కీలకమైన పాత్రలకు తీసుకున్నారని చెప్తున్నారు.

  English summary
  Dutch actress Liza van der Smissen is now talking about Young Tiger Jr NTR. If anyone wonders why, here is the interesting snippet.A professional dancer, theatre and film artist of Dutch origin who lives in London, Liza is all praises for NTR after she acted with Jr NTR in "Nannaku Prematho" movie. Updating her facebook status about this Sukumar directorial and Jr NTR regularly, she posted many photos with actors like Tahgubothu Ramesh too. She stated that Jr NTR is quite brilliant actor and fantastic person.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X