‘నాన్నకు ప్రేమతో’ సాంగ్ లిరిక్స్...
హైదరాబాద్: 'నాన్నకు ప్రేమతో' సినిమాలోని టైటిల్ సాంగ్ చిత్ర బృందం ఇటీవల ప్రత్యేకంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల పరమపదించిన దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తిని స్మరించుకుంటూ ఆయనకు ఈ పాటను అంకితం ఇచ్చారు. ఈ పాటను స్వయంగా దేవిశ్రీ ప్రసాద్ రాయడం, సంగీతం అందించడంతో పాటు తన సోదరుడితో పాటు కలిసి పాడారు.
ఈ సందర్భంగా దేవి శ్రీ "మనిషికి ఎన్ని ఎమోషన్స్ ఉన్నా ప్రపంచంలో అందరూ కనెక్ట్ అయ్యేది అమ్మానాన్నలకు మాత్రమే. సినిమాలో తండ్రి పాత్రను నవ్వుతూ చనిపోయినట్టు చూపించారు. మా నాన్న విషయంలోనూ అదే జరిగింది. ఆయన కొడుకునైనందుకు గర్వపడుతున్నాను. ఈ సినిమాను, పాటలను మా నాన్నగారికి అంకితమిచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్" అన్నారు.
మా జీవిత కథల్ని ఆనందం నిండిన కలంతో రాసినందుకు, మా కదలికలకు దిశానిర్దేశం చేసి సరైన గమ్యాల్ని చేర్చినందుకు, మా జీవితాన్ని అందమైన రంగులతో నింపినందుకు ప్రేమతో.. ఆ పాట రాసినట్లు దేవిశ్రీ చెప్పుకొచ్చారు.
సాంగ్ లిరిక్స్.....

ఏ కష్టమెదురొచ్చినా.. కన్నీళ్లు ఎదిరించిన
ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం
నేనేదారిలో వెళ్ళినా ఏ అడ్డు నన్నాపినా
నీ వెంట నేనున్నానని నను నడిపించిన
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం
ఏ తప్పు నే చేసినా తప్పటడుగులే వేసినా
ఓ చిన్ని చిరునవ్వుతోనే నను మన్నించిన
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం
ఏ ఊసు నే చెప్పిన ఏ పాట నే పాడినా
భలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయిన
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం
ఈ అందమైన రంగుల లోకాన
ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమందించిన
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో వందనం ఈ పాటతో.. ఈ పాటతో.. ఈ పాటతో..


Click it and Unblock the Notifications











