»   » సుకుమార్ మెచ్చిన ‘ఫ్రెండుకు ప్రేమతో..’(వీడియో)

సుకుమార్ మెచ్చిన ‘ఫ్రెండుకు ప్రేమతో..’(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నాన్నకు ప్రేమతో'. సినిమా మొదలైన నాటి నుండే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు రాబడుతోంది. మరో వైపు ‘నాన్నకు ప్రేమతో' సినిమాను అనుకరిస్తూ కొందరు వీడియోలు సైతం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ స్టైల్, డాన్స్ అనుకరిస్తూ కొందరు అభిమానులు వీడియోలు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా సుకుమార్ స్కీన్‌ప్లేని అనుకరిస్తూ ‘ఫ్రెండ్స్‌కు ప్రేమతో' అంటూ ఓ స్పూఫ్ వచ్చేసింది. కాలేజికి డుమ్మా కొట్టే ఓ విద్యార్ధికి అతని స్నేహితుడు ఎలా దారిలో పెట్టాడు..? అన్న అంశాన్ని అచ్చం ‘నాన్నకు ప్రేమతో' సినిమాలో సుకుమార్ స్క్రీన్‌ప్లే తలపించేలా చూపించాడు. ఈ వీడియో సుకుమార్ కు నచ్చడంతో ‘వెరీ గుడ్ అటెమ్ట్' అంటూ ప్రశంసిస్తూ దాన్ని తన సోషల్ మీడియా పేజీ ద్వారా షేర్ చేసారు. ఈ వీడియోను ఇప్పటికే లక్షకుపైగా వ్యూస్ రావడం గమనార్హం.

A very good attempt!!

Posted by Sukumar B on Thursday, January 28, 2016

ఇప్పటి వరకు ఎన్టీఆర్ కు మాస్ ఆడియన్స్ ఫాలోయింగ్ మాత్రమే ఎక్కువగా ఉండేది. క్లాస్ ఆడియన్స్ ఫాలోయంగ్ కాస్త తక్కువగా ఉండేది. దీంతో ఎన్టీఆర్ గత సినిమాలు ఇప్పటి వరకు 50 కోట్ల మార్కను అందుకోలేక పోయాయి. అయితే ఈ సినిమాతో క్లాస్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. తారక్ కెరీర్లో 50 కోట్లు వసూలు చేసిన తొలి సినిమా ఇదే.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించగా, ఎన్టీఆర్ తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్, విలన్ గా జగపతి బాబు, ఇతర ముఖ్య పాత్రల్లో రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, సితార, అమిత్, తాగుబోతు రమేష్, గిరి, నవీన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ: విజయ్ చక్రవర్తి, ఆర్ట్: రవీందర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, పాటలు: చంద్రబోస్, డాన్స్: రాజు సుందరం, శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుకుమార్.

English summary
Director Sukumar liked Nannaku prematho spoof as Friend ki Prematho.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu