»   » ‘నాన్నకు ప్రేమతో’లో అదిరిపోయే స్టంట్స్ (ఫోటోస్)

‘నాన్నకు ప్రేమతో’లో అదిరిపోయే స్టంట్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా ఈ చిత్రానికి ‘నాన్నకు ప్రేమతో' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇపుడు అదే టైటిల్ ఖరారు చేస్తూ వినాయక చవితి సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు. ఎన్టీఆర్ డిఫరెంట్ స్టైలిష్ లుక్ సూపర్బ్ గా ఉంది.

ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. ఈ చిత్రం జనవరి 8,2016న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ లోగా దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 22న టీజర్ ని విడుదల చేయాలని నిర్ణయించారు.

ప్రస్తుతం లండన్‌లో చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారం. ఓ పాత్ర కోసం గడ్డంతో, స్త్టెలిష్‌గా కనిపిస్తున్నాడు తారక్‌. ప్రస్తుతం ఆ గెటప్పే చిత్ర బృందం బయటపెట్టింది. అయితే.. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ మరో పాత్రలో కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. ఆ గెటప్‌ను చిత్రబృందం గోప్యంగా ఉంచుతోంది. ఈ ఇద్దరి ఎన్టీఆర్‌ల మధ్య ఉన్న సంబంధం ఏమిటన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఈ సినిమాకు ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ స్టంట్స్ కంపోజ్ చేస్తున్నారు. లండన్‌లో ఈ సినిమాకు సంబంధించి ఓ భారీ స్టంట్ కంపోజ్ చేసాడు. ఈ సందర్భంగా తన స్టంట్ టీం ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసారు.

ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి...

ఎన్టీఆర్ తో

ఎన్టీఆర్ తో


లండన్ షూటింగులో ఎన్టీఆర్ తో పీటర్ హెయిన్స్.

కంపోజ్ చేస్తూ..

కంపోజ్ చేస్తూ..


నాన్నకు ప్రేమతో సినిమాకు ఫైట్స్ కంపోజ్ చేస్తూ...

పీటర్ హెయిన్స్

పీటర్ హెయిన్స్


హాలీవుడ్ సినిమాల రేంజిలో ఫైట్స్ కంపోజ్ చేసాడు.

ఎన్టీఆర్-పీటర్

ఎన్టీఆర్-పీటర్


నాన్నకు ప్రేమతో సినిమా సెట్లో ఎన్టీఆర్ తో పీటర్ హెయిన్స్

స్టంట్ టీం

స్టంట్ టీం


నాన్నకు ప్రేమతో సినిమాకు పని చేసిన స్టంట్ టీం.

పీటర్ హెయిన్స్...

పీటర్ హెయిన్స్...


ఎన్టీఆర్ చేయాల్సిన సీన్స్ చేసి చూపెడుతున్న పీటర్

English summary
Nannaku Prematho‬ stunt team.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu