»   »  పోస్టర్ వివాదం: ‘నాన్నకు ప్రేమతో’ నిర్మాత క్షమాపణ!

పోస్టర్ వివాదం: ‘నాన్నకు ప్రేమతో’ నిర్మాత క్షమాపణ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, ఆర్య సుకుమార్‌ కాంబినేషన్‌లో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో..'. ఈ చిత్రాన్ని జనవరి 13న సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు.

Nannaku Prematho team unconditional apology

కాగా... ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ఒకటి వివాదాస్పదంగా మారింది. పోస్టర్ బ్యాగ్రౌండ్లో ఓ మతానికి సంబంధించి వివాదాస్పదంగా ఉండటమే ఇందుకు కారణం. దీంతో కొందరు వ్యక్తులు ఆందోళన చేసారు. దీంతో వెంటనే స్పందించిన ‘నాన్నకు ప్రేమతో' టీం వెంటనే ఆ పోస్టర్ ను తొలగించింది. సినిమాలో కూడా ఆ సన్నివేశాలు తీసేసినట్లు ప్రకటించింది. జరిగిన పొరపాటుకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, పోస్టర్ డిజైన్లో తప్పిదం వల్లనే అలా జరిగిందని తెలిపారు. తాజాగా ఆ పోస్టర్ స్థానంలో బ్యాగ్రౌండ్ తొలగించి కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు.


Nannaku Prematho team unconditional apology

నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ - '''నాన్నకు ప్రేమతో' చిత్రానికి సంబంధించిన ఒక సాంగ్‌ పోస్టర్‌లోని బ్యాక్‌గ్రౌండ్‌ ముస్లిం సోదరుల మనో భావాలను కించపరిచే విధంగా వుందని మా దృష్టికి వచ్చింది. మేం అన్ని మతాల సంప్రదాయాలను గౌరవిస్తాం. అందుకే ఆ పోస్టర్‌లోని బ్యాక్‌గ్రౌండ్‌ని తొలగించి కొత్త పోస్టర్‌ను విడుదల చేశాం. అలాగే సినిమాలోని ఆ సాంగ్‌లో కూడా బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చేస్తున్నాం. మేం విడుదల చేసిన పోస్టర్‌ వల్ల ముస్లిం సోదరుల మనోభావాలు దెబ్బతిన్నందుకు వారికి మేం బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నాం. మేం ఏ మతానికీ వ్యతిరేకం కాదు. వారి మనోభావాలను దెబ్బతియ్యాలనికానీ, వారికి చెడు తలపెట్టాలని కానీ మా ఉద్దేశం కాదు. అన్ని మతాల వారికి స్వేచ్చ, గౌరవంగా జీవించే హక్కు వుంది. ఆ పోస్టర్‌ అనుకోకుండా వచ్చిందే తప్ప ముస్లిం సోదరులను బాధ పెట్టాలన్న ఉద్దేశంతో రిలీజ్‌ చేసింది కాదు'' అన్నారు.


''యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే అత్యంత కాస్ట్‌లియస్ట్‌ చిత్రంగా రూపొందిన 'నాన్నకు ప్రేమతో' చిత్రాన్ని జనవరి 13న సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. దేవిశ్రీప్రసాద్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియో చాలా పెద్ద హిట్‌ అయింది. అన్ని ఏరియాల నుంచి ఆడియోకి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ చిత్రానికి అన్నీ సూపర్‌హిట్‌ పాటలు చేశారు దేవిశ్రీప్రసాద్‌. ఎన్టీఆర్‌, సుకుమార్‌ ఫస్ట్‌ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది'' అన్నారు.యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.

English summary
"It has come to our notice that some members of a religious community have been offended by a background image used in a song poster of Nannaku Prematho. We respect the religious sentiments of the community and have replaced the image with a new one. The offending background has also been removed from the film.We offer an unconditional apology to the members of the community for any offence caused to religious sentiments because of the background image." said Nannaku Prematho team.
Please Wait while comments are loading...