»   »  అద్భుతంగా ఉంది: దేవిశ్రీ నాన్న ప్రేమతో....(వీడియో)

అద్భుతంగా ఉంది: దేవిశ్రీ నాన్న ప్రేమతో....(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: టాలీవుడ్‌ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ తండ్రి, ప్రముఖ సినీ రచయిత సత్యమూర్తి ఇటీవల కన్నమూసిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన్ని గుర్తు చేసుకుంటూ...దేవిశ్రీ తన నాన్న కోసం ఓ పాటను రచించారు. ఈ పాటను తాజాగా విడుదల చేసారు. ఈ పాటలో దేవిశ్రీ నాన్నపై తనకు ఉన్న ప్రేమను వ్యక్తీకరించిన తీరు అద్భుతంగా ఉంది. ఈ పాటను రచించి, సంగీతం అందించడంతో పాటు తన సోదరుడు సాగర్ తో కలిసి పాడారు దేవిశ్రీ.


ఈ పాట కూడా ఇటీవల విడుదల ‘నాన్నకు ప్రేమతో' సినిమాకు సంబంధించినదే. ఈ పాటను ‘నాన్నకు ప్రేమతో' చిత్రం ముగింపులో పెట్టారు. సినిమా విడుదల ముందే దేవిశ్రీ ఈ పాట విషయం ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ పాటను తండ్రులందరికీ అంకితం చేస్తున్నట్లు తెలిపారు.


Nannaku Prematho Title Song

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దేవిశ్రీ మాట్లాడుతూ...నాన్నపై అత్యంత ప్రేమ ఉన్న ఏడెనిమిది మంది కలసి తీసిన సినిమా ఇది. దేవిశ్రీ ప్రసాద్‌కీ వాళ్ల నాన్నంటే చెప్పలేనంత అభిమానం. అందుకోసమే చాలా కసిగా చేసాడు ఈ సినిమాను. ఈ సినిమాకు ఏ పేరు పెడితే బాగుంటుందా అని ఆలోచిస్తున్నప్పుడు నాకు సుకుమార్‌ సినిమాలు గుర్తుకొచ్చాయి. సినిమా చివర్లో అమ్మానాన్నలకి ప్రేమతో అని రాస్తుంటారు. అది గుర్తుకొచ్చి ‘నాన్నకు ప్రేమతో అని పెడితే ఎలా ఉంటుంది సర్‌' అన్నా. ‘చాలా బాగుంటుంది, ఇదే పెట్టేద్దాం' అన్నారాయన.


నాన్నకు ప్రేమతో' అనే పేరు తట్టడం కూడా ఈ కథ గొప్పదనమే. ఈ సినిమాలో ‘అందరూ టైమ్‌ని సెకండ్లలోనూ, నిమిషాల్లోనూ కొలుస్తారు. కానీ నేను మా నాన్న గుండె చప్పుడుతో కొలుస్తుంటా' అనే డైలాగ్‌ ఉంది. ఆ డైలాగ్‌ నుంచి పుట్టిందే సినిమా లోగోకు మధ్యలో ఉన్న గుండె చప్పుడు గుర్తు. అది నేను సూచించిందే అని సుకుమార్‌గారు చెప్పడం ఆయన గొప్పతనం. కానీ నాకు ఆయన చెప్పిన డైలాగ్‌తోనే ఆ చిహ్నం గుర్తుకొచ్చింది'' అని చెప్పుకొచ్చారు.


English summary
Nannaku Prematho Latest Telugu movie Title song video dedicated to legendary writer Sri Satyamurthy Garu and all the loving fathers by DSP / Devi Sri Prasad, Sagar and Padmini. #NannakuPrematho movie features Jr NTR, Rakul Preet, Jagapathi Babu and Rajendra Prasad. Music composed by DSP. Directed by Sukumar. Produced by BVSN Prasad under the banner Sri Venkateswara Cine Chitra / SVCC.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu