»   » ‘నాన్నకు ప్రేమతో’ టైటిల్ సాంగ్ (ఫుల్ వీడియో)

‘నాన్నకు ప్రేమతో’ టైటిల్ సాంగ్ (ఫుల్ వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

  హైదరాబాద్: ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాన్నకు ప్రేమతో' సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దేవిశ్రీ స్వయంగా రాసి, కంపోజ్ చేసి, పాడిన టైటిల్ సాంగుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియోను రిలీజ్ చేసారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి...


  ఇటీవల ఈ టైటిల్ సాంగ్ ప్రత్యేకంగా విడుదల చేసారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ...‘నాన్నకు ప్రేమతో' చిత్రం ఒక గొప్ప విజయంతో పాటు, నేను బ్రతికినంత కాలం గుర్తుంచుకునే ఒక అనుభూతిని మిగిల్చిన చిత్రం. అందుకు కారణమైన సుకుమార్ గారికి థాంక్స్. ఇది కేవలం సక్సెస్ కాదు...ఒక ఫీల్. ‘నాన్నకు ప్రేమతో' చిత్రం ఒక బొమ్మయితే దేవిశ్రీ తన సంగీతంతో ఆ బొమ్మకు ప్రాణం పోసారు. దేవిశ్రీ ప్రసాద్ నాన్నగారు సత్యమూర్తిగారే ఇంత మంచి సాంగ్ రాయించారని అనుకుంటున్నాను అన్నారు.


   Nannaku Prematho Title Song Full Video

  ఇప్పటి వరకు ఎన్టీఆర్ సినిమాలు రూ. 50 కోట్ల మార్కును కూడా అందుకోలేదు. ఎట్టకేలకు ‘నాన్నకు ప్రేమతో' చిత్రంతో ఎన్టీఆర్ తన కెరీర్లో తొలి సారి 50 కోట్ల మార్కను అందుకోబోతున్నారు. ‘నాన్ను ప్రేమతో' చిత్రం మంగళవారంతో బాక్సాఫీసు వద్ద తొలి వారం పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు ఈ చిత్రాని వరల్డ్ వైడ్ రూ. 42 కోట్ల షేర్ వచ్చింది. మరో 8 కోట్ల అవలీలగా వస్తాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరో వైపు ఈ చిత్రం ఓవర్సీస్ లో 2 మిలియన్ మార్కుకు చేరువైంది. సినిమాకు మరో 12 కోట్లు వస్తే పూర్తిగా సేఫ్ జోన్లోకి వెళ్లినట్లే అంటున్నారు.


  ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించగా, ఎన్టీఆర్ తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్, విలన్ గా జగపతి బాబు, ఇతర ముఖ్య పాత్రల్లో రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, సితార, అమిత్, తాగుబోతు రమేష్, గిరి, నవీన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ: విజయ్ చక్రవర్తి, ఆర్ట్: రవీందర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, పాటలు: చంద్రబోస్, డాన్స్: రాజు సుందరం, శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుకుమార్.


  English summary
  Nannaku Prematho Latest Telugu movie Title Song Full Video. #NannakuPrematho movie stars Jr NTR, Rakul Preet, Jagapathi Babu and Rajendra Prasad. Music by DSP / Devi Sri Prasad. Directed by Sukumar. Produced by BVSN Prasad under the banner Sri Venkateswara Cine Chitra / SVCC..
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more