»   » ఇండియా వచ్చేస్తున్నాం: సుకుమార్

ఇండియా వచ్చేస్తున్నాం: సుకుమార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్టీఆర్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో'. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం స్పెయిన్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈరోజుతో స్పెయిన్‌లో షూటింగ్ పూర్తి అయినట్లు దర్శకుడు సుకుమార్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

Spain schedule successfully wrapped up!!


Posted by Sukumar B on 17 December 2015

ఈ షెడ్యూల్ తో ఒక్క పాట మినహా షూటింగ్‌ మొత్తం కంప్లీట్‌ అయినట్లే. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్‌ చివరి వారంలో ఆడియోను రిలీజ్‌ చేయనున్నారు. అలాగే జనవరి 13న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.


అలాగే.. ఈ చిత్రం బిజినెస్ కూడా అదే స్పీడుతో జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం ఉత్తరాంధ్ర, వైజాగ్ రైట్స్ ని విబిఎమ్ రెడ్డి ఫిలిమ్స్ వారు సొంతం చేసుకున్నారు. నిన్నే ఈ డీల్ ఫైనల్ అయ్యింది. నాన్ రిఫండబుల్ ఎడ్వాన్స్ పద్దతిలో విబిఎన్ రెడ్డి ఫిల్మ్స్ వారు తీసుకున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.


NannakuPrematho‬ completed Spain schedule

రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సమకూర్చారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

English summary
Director Sukumar sharing the details tweeted, "Spain schedule wrapped up".
Please Wait while comments are loading...