»   » కొరటాల శివ విషెష్ చెప్తూ...

కొరటాల శివ విషెష్ చెప్తూ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్టీఆర్ తాజా చిత్రం నాన్నకు ప్రేమతో. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జనవరి 13న అంటే ఈ రోజు సంక్రాంతి కానుకగా విడుదల అవుతోంది. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ తో తదుపరి చిత్రం చేస్తున్న కొరటాల శివ ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ లో ఆయన ఎన్టీఆర్ చిత్రం కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలియచేసారు. ఆ ట్వీట్ చూడండి.


కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే చిత్రానికి జనతా గ్యారేజ్ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇదే టైటిల్ ఫైనలైజ్ చేస్తారా లేదా అనే సందేహంలో ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఇదే టైటిల్ ని ఫైనలైజ్ చేసేటట్లు ఉన్నట్లు అర్దమవుతోంది. రీసెంట్ గా నాన్నకు ప్రేమతో చిత్రం ప్రమోషన్ లో భాగంగా ప్రింట్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం ప్రస్దావించారు. ఆయన ఏమన్నారంటే...


ఎన్టీఆర్ మాట్లాడుతూ...నెక్స్ట్‌ మాత్రం కొరటాల శివతో ‘జనతాగేరేజ్‌' చేస్తున్నా. నాతో రాజమౌళి సినిమా ఎప్పుడుంటుందన్నది అతని ఛాయిసే. అతను ఇక్కడిక్కడే సినిమాలు తీసుకుంటూ ఉండకూడదు. తను ఇంటర్నేషనల్‌ స్థాయికి వెళ్లాలి. ఏషియన ఫిల్మ్స్‌కి ఆయన అక్కడ డోర్‌ ఓపెన చేయాలి. ఆయనకు అంత కెపాసిటీ ఉందని నా ఫీలింగ్‌. వినాయక్‌తో ఏ సినిమా ఉంటుందో ఇప్పుడే చెప్పలేను. అదుర్స్‌ 2 చేయాలని నాక్కూడా ఉంది అని జనతా గ్యారేజ్ గురించి చెప్పేసారు.


NannakuPrematho‬...Koratala Shiva tweet

సుకుమార్ డైరక్షన్ లో ఎన్టీఆర్ నటించిన స్టైలిష్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన సినిమా నాన్నకు ప్రేమతో. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని టీం అంతా నమ్ముతోంది.


రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు.


ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.English summary
koratala siva tweeted:" All the very best to the team of #NannakuPrematho. Can't wait to watch tarak9999's mind boggling new avatar.Wish the night moves on fast."
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu