»   » కమర్షియల్ ఎలిమెంట్ష్ తగ్గాయి: హీరోగారికి చంద్రబాబు సూచన

కమర్షియల్ ఎలిమెంట్ష్ తగ్గాయి: హీరోగారికి చంద్రబాబు సూచన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నారా రోహిత్ త్వరలో ‘అసుర' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో సినిమాకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు. ‘అసుర' యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోందని...ఇందులో ధర్మ అనే జైలర్ క్యారెక్టర్ చేసాను. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలతో పోల్చితే కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండే సినిమా. కాన్సెప్టు చాలా కొత్తగా ఉంటుందని తెలిపారు.

‘పెద్ద నాన్న నారా చంద్రబాబు తన సినిమాలు అన్నీ చూస్తారు. అయితే అప్పట్లో ఎన్నికల కారణంగా ప్రతినిధి, రౌడీ ఫెలో సినిమాలు చూడలేదు. నా సినిమాలు చూసి డిఫరెంట్ సినిమాలు చేసినా కమర్షియల్ ఎలిమెంట్ష్ తగ్గాయి. ఫ్యామిలీ అంతా కలిసి చూసే కమర్షియల్ సినిమా చేయాలని చెప్పారు' అంటూ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు నారా రోహిత్.


సినిమాలో తన క్యారెక్టర్ గురించి వివరిస్తూ...సినిమాలో నేను పని రాక్షసుడిని. చేయాల్సిన పనిని ఎవరైనా అశ్రద్ధ చేస్తే ఒప్పుకోకుండా, ఆ పనిని సాధించుకోవడం కోసం ఎంత దూరం అయినా వెళ్లే జైలర్ కథ. పురాణాల్లో రాక్షసులను చంపేవాడిని దేవుడనేవారు. ఇపుడు నేను అదే చేస్తున్నాను అనే డైలాగ్ కూడా ఉంటుంది అన్నారు.


Nara Rohit interview about 'Asura' movie

ఈ సినిమాకు నిర్మాతగా మారడంపై స్పందిస్తూ....ఒక వేళ నేను హీరో కాకుండా ఉంటే కచ్చితంగా నిర్మాత అయ్యేవాణ్ణి. ఎప్పటి నుండో సినిమా ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను. అంతే కాకుండా ఈ గ్యాప్ లో సినిమా వర్క్ ఎలా నడుస్తుందనే విషయమై అవగాహన వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ తోనే సినిమాకు నిర్మాతగా మారాను. ఈ సినిమాకు నేను, శ్యామ్ దేవభక్తుని, కష్ణ విజయ్ ముగ్గురు నిర్మాతలం. నేను ప్రీప్రొడక్షన్ లో ఎక్కువగా ఇన్ వాల్వ్ అయ్యాను. తర్వాత వాళ్లిద్దరే చూసుకున్నారు అని తెలిపారు.


దర్శకుల్లో నేను కొత్త పాత అని చూడను...ఎవరైనా స్టార్టింగ్ కొత్తవాళ్లే. నేను చేస్తున్న దర్శకులు ఎక్కువ మంది కొత్తవాళ్లే. వాళ్లు రాసుకున్నకథకు రోహిత్ న్యాయం చేస్తాడని నా దగ్గరకు వచ్చారు. కథను, డైరెక్టర్ ను నమ్మి సినిమాలు చేస్తున్నాను అంతే. స్టార్ డైరెక్టర్లతో చేయకూడదనేం కాదు. స్టార్ డైరెక్టర్లు రాసుకున్న కథకి రోహిత్ న్యాయం చేస్తాడని వారనుకుంటే వారి నుండి కాల్ వస్తుంది. అప్పుడు వారితో కచ్చితంగా సినిమాలు చేస్తాను అంటూ...నారా రోమిత్ చెప్పుకొచ్చారు.


తన తర్వాతి సినిమాల గురించి వెల్లడిస్తూ... తర్వాత రాబోయే సినిమా ‘పండగలా వచ్చాడు' లవ్ స్టోరీ విత్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టెనర్. గోదావరి స్లాంగ్ తో ఉంటుంది. పవన్ సాధినేనితో చేస్తున్న ‘సావిత్రి' సినిమా ఆగస్టులో ప్రారంభం అవుతుంది. ఇది ప్యూర్ లవ్ స్టోరీ. ‘నలదమయంతి' పది, పదిహేను రోజుల షూటింగ్ మాత్రమే పెడింగ్ ఉంది. ‘అప్పట్లో ఒకడుండేవాడు' సినిమా ప్రీప్రొడక్షన్ దశలో ఉందని తెలిపారు.

English summary
Nara Rohit interview about 'Asura' movie.
Please Wait while comments are loading...