»   » షాకింగ్: హీరో నారా రోహిత్ రౌడీ ఫెల్లో?

షాకింగ్: హీరో నారా రోహిత్ రౌడీ ఫెల్లో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య వచ్చే పలు తెలుగు సినిమా టైటిళ్లు అభిమానులను, ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తున్నాయి. తాజాగా హీరో నారా రోహిత్ 'రౌడీ ఫెల్లో' అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా సినీగేయ రచయిత కృష్ణ చైతన్య దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. త్వరలో ఈచిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అఫీషియల్‌గా వెల్లడి కానున్నాయి.

ఇటీవలే ఈచిత్రం షూటింగ్ ప్రారంభమైంది. నారా రోహిత్‌పై పలు సీన్లు చిత్రీకరించారు. విశాఖ సింగ్ మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, నందినీ రాయ్ సెకండ్ హీరోయిన్. స్వామిరారా నిర్మాత చక్రి చిగురు పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సన్నీ సంగీతం అందిస్తున్నారు. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రొడక్షన్ హౌస్ నుంచి వెలువడనుంది.

ప్రస్తుతం నారా రోహిత్ నటించిన 'ప్రతినిధి' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. గుమ్మడి రవీంద్ర బాబు సమర్పణలో సుధా సినిమాస్ పతాకంపై జె.సాంబఇవరావు నిర్మిస్తున్నారు. సాయికార్తీక్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలు ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ప్రస్తుత రాజకీయాలలో పేరుకుపోయిన స్వార్ధం, అవినీతి మరియు సమాజ వ్యవస్థలో ఏర్పడిన లోపాలను ప్రశ్నించడానికి సామాన్య ప్రజల తరుపున 'ప్రతినిధి'లా వస్తున్నాడు నారా రోహిత్.

సినిమా గురించి హీరో రోహిత్ మాట్లాడుతూ..స్నేహితుడి ద్వారా కదా విన్నాను. చాలా మంచి సినిమా చేస్తున్నాను అనిపించింది. నన్ను నమ్మి ఈ సినిమా చేస్తున్న దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ప్రస్తుతం రగులుతున్న రాజకీయాల మీద, సామాజిక అంశాల మీద ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాకి సాయి కార్తీక్ అందించిన సంగీతం చాలా హెల్ప్ అయింది. అద్బుతమైన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు అని అన్నారు.

English summary
Nara Rohit is currently acting in a film that is being directed by Krishna Chaitanya. Buzz is that the film has been titled as Rowdy Fellow, although a formal announcement is yet to be made.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu