For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కమర్షియల్ ఫార్మట్‌లో 'ఒక్కడినే'(ప్రివ్యూ)

  By Srikanya
  |

  హైదరాబాద్: నారా రోహిత్ హీరోగా గులాబీ మూవీస్‌ పై సి.వి.రెడ్డి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఒక్కడినే'. నిత్యా మీనన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ఈ రోజే వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అవుతోంది. ఇదివరకు నేను చేసిన 'సోలో', ఇప్పుడు 'ఒక్కడినే' రెండూ ఒకే అర్థాన్నిచ్చే టైటిల్స్‌లా కనిపిస్తున్నప్పటికీ రెండింటి మధ్యా భేదం ఉంది. 'సోలో' అనేది డెఫినిషన్ అయితే, 'ఒక్కడినే' అనేది స్టేట్‌మెంట్. కథ విషయంలో రెండింటికీ ఏమాత్రం సారూప్యత ఉండదు అని హీరో నారా రోహిత్ చెప్తున్నారు.

  చిత్రం లో కథ... సూర్య అనే యువకుడికీ ఓ ప్రవాసాంధ్ర యువతికీ మధ్య సాగే ప్రేమ.. వాటి మూలంగా వచ్చే సమస్యలుగా జరుగుతుంది. నారా రోహిత్ మాటల్లోనే... కుటుంబం కోసం 'ఒక్కడినే' ఏం చేశాననేది ఇందులోని ప్రధానాంశం. సహజంగానే కుటుంబపరమైన భావోద్వేగాలు ఉంటాయి. నా పాత్ర పేరు సూర్యచంద్ర. నా క్యారెక్టరైజేషన్ ఏమిటన్నది నా పేరే చెబుతుంది. ఇటు చంద్రునిలోని చల్లదనం, అటు సూర్యునిలోని తీక్షణత్వం.. రెండూ నా పాత్రలో ఉంటాయి. నేడు మన కుటుంబాల్లో జరిగేటువంటి అనుబంధాల్ని టచ్‌ చేస్తూ నిర్మిస్తున్న కుటుంబ కథా చిత్రమిది అన్నారు.

  అలాగే 'ఒక్కడినే' కమర్షియల్ స్టోరీ అయినా స్క్రీన్‌ప్లే కొత్తగా అనిపించింది. ఫ్రెష్‌లుక్ కనిపించింది. అందుకే శ్రీనివాస్ రాగ కథ చెప్పేప్పుడు ఎగ్జయిట్ అయ్యాను. ఇప్పుడు సినిమా చూసుకున్నాక అదే ఎగ్జయిట్‌మెంట్ నాలో ఉంది. ప్రతి సన్నివేశాన్నీ చక్కగా తీర్చిదిద్దాడు శ్రీనివాస్. ఆయన మొదటి సినిమా 'కథ' ఓ థ్రిల్లర్. రెండో సినిమా 'ఒక్కడినే'ని కమర్షియల్ ఫార్మట్‌లో తీశాడు. కథ, స్క్రీన్‌ప్లే.. రెండూ సినిమాకి బలం. ప్రేక్షకులు ఆద్యంతం సినిమాని ఆస్వాదిస్తారని గట్టిగా చెప్పగలను. యాక్షన్ ఎపిసోడ్స్ బావుంటాయి. ప్రతి యాక్షన్ సీక్వెన్స్‌లోనూ ఎమోషన్స్ ఉండటం వల్ల అవి ప్రేక్షకులకి అవి బాగా కనెక్టవుతాయి.

  హీరోయిన్ గురించి చెప్తూ... "నిత్యా మీనన్ చాలా సౌకర్యవంతమైన సహ నటి. ఇది హీరో హీరోయిన్ల మధ్య జరిగే కథ. మా ఇద్దరివీ సమాన ప్రాధాన్యం ఉన్న పాత్రలే. సునాయాసంగా భావాలు పలికించే నిత్య సినిమాకి పెద్ద ఎస్సెట్. ఆమె క్యారెక్టర్ అందర్నీ బాగా ఆకట్టుకుంటుంది'' అని నిత్యామీనన్‌పై ప్రశంసలు కురిపించారు నారా రోహిత్

  బ్యానర్: గులాబీ మూవీస్‌
  జెనప్: యాక్షన్ - రొమాన్స్
  నటీనటులు: నారా రోహిత్‌, నిత్యా మీనన్‌, నాగబాబు, చంద్రమోహన్‌, సాయికుమార్‌, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, యం.యస్‌.నారాయణ, బెనర్జీ, జీవి, ఆలీ, శ్రీనివాసరెడ్డి, సత్యకృష్ణ, సుధ, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు.
  మాటలు: చింతపల్లి రమణ,
  సంగీతం: కార్తీక్‌,
  ఛాయాగ్రహణం: ఆండ్రుబాబు,
  కళ: నాగేంద్ర,
  ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌,
  కో-డైరెక్టర్‌: కళ్యాణ్‌,
  ప్రొడక్షన్‌: తాండవకృష్ణ
  నిర్మాత: సి.వి.రెడ్డి,
  కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్‌ రాగ.
  విడుదల తేదీ: పిబ్రవరి 14, 2012
  సెన్సార్ రేటింగ్: U/A
  డ్యూరేషన్: 02:30 గంటలు.

  English summary
  Producer CV Reddy's Okkadine starring Nara Rohit and Nithya Menon in leads, is one of the most-hyped Telugu movies. Directed by Katha fame Srinivas Raga, the film was to release in November 2012, but got delayed nearly three months for some unknown reason. Finally, this much-awaited flick has hit the marquee today. Will it reach the expectations of viewers that it has created prior its release?
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X