For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చీపురు పట్టిన ఇంకో తెలుగు హీరో (ఫొటోలు)

  By Srikanya
  |

  మంగళగిరి: ప్రధాన మంత్రి మోదీ పిలుపు మేరకు యువత స్వచ్ఛభారత్‌లో భాగస్వాములు కావాలని సినీ హీరో నారా రోహిత్‌ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. వి.జె.జూనియర్‌ కళాశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్‌ ప్రతిజ్ఞ చేశారు. పురపాలక సంఘం కౌన్సిలర్‌లు, తెదేపా నాయకులు, అభిమానులతో కలిసి రోహిత్‌ వీధులను శుభ్రం చేశారు.

  నారా రోహిత్ మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వచ్ భారత్ కార్యక్రమంలో అందరూ పాల్గొని తమ తమ ప్రాంతాలను శుభ్రపరచాలని అదే విధంగా ఎవరికి వారు తమ ఇంటి చుట్టు ప్రక్కల ప్రాంతాలను కూడా శుభ్రంగా చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. శుభ్రత లేకపోవటం వలన అంటు రోగాలు ఎక్కువగా వస్తున్నాయని ఈ మధ్యనే ఐక్యరాజ్య సమితిలో తెలియచేసారు. ఇలాంటి ఏ కార్యక్రమం జరిగనా నేను తప్పకుండా పాల్గొంటాను. ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలి అని రోహిత్ తెలిపారు.

  సినిమాల విషయానికి వస్తే...

  తాజాగా నారా రోహిత్ సైతం పోలీస్ గా అదరకొట్టాలని నిర్ణయించుకున్నాడు. అతని తాజా చిత్రం రౌడీ ఫెలో లో రోహిత్ పోలీస్ గా కనపడనున్నారు. నారా రోహిత్ హీరోగా మూవీ మిల్స్, సినిమా 5 సంస్థలు నిర్మిస్తున్న 'రౌడీ ఫెలో ' చిత్రం షూటింగ్ పూర్తయింది. రామోజీ ఫిలిం సిటీ, రాజమండ్రి, కొల్లేరు, భీమవరం ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ జరిగింది.

  దర్శకుడు మాట్లాడుతూ.... మాటలు రాక మాట్లాడలేనివాళ్లు కొందరైతే.. మాటలు వచ్చీ నోరు మెదపలేనివాడు పేదవాడు. ఆ పేదోడి ఆవేదనను అర్థం చేసుకొని అండగా నిలబడిన పోలీసు కథేంటో తెరపైనే చూడాలి అన్నారు.

  నిర్మాత మాట్లాడుతూ ''ఒక పోలీసు అధికారి కథ ఇది. ఖాకీ చొక్కా వేసుకొన్న ఆ పోలీసు రౌడీఫెలో అని ఎందుకు అనిపించుకొన్నాడన్నది ఆసక్తికరం. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. ప్రచార చిత్రాల్లో వినిపించిన సంభాషణలు ఆకట్టుకొన్నాయి. నారా రోహిత్‌ నటనతో పాటు కృష్ణచైతన్య చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''అన్నారు.

  Nara Rohit participates in 'Swach Bharat' campaign

  అలాగే...'యాక్షన్, కామెడీ, రొమాన్స్ అంశాలు మిళితమైన సినిమా ఇది. దర్శకుడు కృష్ణచైతన్య విభిన్నంగా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. 'స్వామి రారా', 'ఉయ్యాల జంపాలా' చిత్రాలకు పనిచేసిన సన్నీ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. 'ఆషికి-2' చిత్రంలో తన గానంతో దేశాన్ని ఉర్రూతలూగించిన గాయకుడు ఆర్జిత్ సింగ్ ఇందులోని అన్ని పాటలూ పాడటం విశేషం' అని తెలిపారు.

  ''అరవై సెకన్లకు 72 సార్లు కొట్టుకొనే గుండెకే లాజిక్‌ లేదు. ఇక నేను చేసే పనుల గురించి అడిగితే నేనేం చెబుతాను..'' అంటున్నారు నారా రోహిత్‌. విశాఖా సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రావు రమేశ్, పరుచూరి వెంకటేశ్వరరావు, గొల్లపూడి, పోసాని, తాళ్లూరి రామేశ్వరి, సుప్రీత్, అజయ్, ఆహుతి ప్రసాద్, ప్రవీణ్, సత్య ఇతర ముఖ్యతారాగణం. గీత రచయిత కృష్ణచైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా5, మూవీ మిరాకిల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సన్ని సంగీతం అందిస్తున్నారు.

  English summary
  The newest member to join the social initiative is Nara Rohith and Devendar Goud’s son Veerender Goud.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X